RAM : ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో ర్యామ్ (Random Access Memory) ముఖ్యమైన ఒక భాగం. ఇందులో స్టోరేజ్ ఆఫ్షన్స్ ఎన్నో ఉన్నాయి. అయితే గ్యాడ్జెట్ కొనే సమయంలో యూజర్స్ వాడే ఆప్లికేషన్స్, పనితీరు, ఫ్యూచర్ అప్‌డేట్‌లను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చెయ్యాలి. మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తున్నప్పుడు RAM సైజ్ ను ఎలా నిర్ధారించాలి.. ఏ ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకుందాం.
మొబైల్ (Mobile) లేదా ల్యాప్ టాప్ (Laptops) కొనుగోలు చేసినపుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. అందులో మఖ్యమైన విషయాలు ఏంటంటే!
మెుబైల్ ర్యామ్స్ –
2GB-4GB RAM : బేసిక్ యూజర్స్ కోసం ఈ స్టోరేజ్ ఆఫ్షన్ ఎంచుకోవచ్చు. సెల్ఫీలు తీసుకోవడం, సోషల్ మీడియా చూడడం, మెసేజ్ చేయడం మొదలైన సాధారణ పనుల కోసం సరిపోతుంది.
6GB-8GB RAM : ఎక్కువ మల్టిటాస్కింగ్ అవసరమయ్యే యూజర్స్ కు గేమ్స్ ఆడేవారికి, లార్జ్ ఫైల్స్ ఎడిట్ చేసే యూజర్స్ కు హై రెసల్యూషన్ వీడియోలు చూస్తున్న వారికీ ఈ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక.
12GB RAM & Above : హై ఎండ్ గేమింగ్, హై గ్రాఫిక్ వర్క్స్, వీడియో ఎడిటింగ్ వంటి మల్టీ టాస్కింగ్ పనుల కోసం ఈ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక.
ల్యాప్‌టాప్ లో RAM –
4GB RAM : బేసిక్ పనుల కోసం సరిపోతుంది.. కానీ మల్టిటాస్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లకు ఈ ర్యామ్ అంతగా సరిపోకపోవచ్చు.
8GB RAM : సాధారణ ల్యాప్‌టాప్ వినియోగదారుల కోసం ఉపయోగించవచ్చు. మల్టిటాస్కింగ్, ఈజీ గ్రాఫిక్ డిజైన్, గేమింగ్, ఇతర పనుల కోసం ఈ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక.
16GB RAM : హై గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్, 3D మోడలింగ్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఉపయోగించేవారికి ఈ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక.
32GB RAM & Above : హై ప్రొఫెషనల్ యూజర్ల కోసం (గేమింగ్, ప్రొఫెషనల్ లాంగ్ వర్క్, ఇంజనీరింగ్, ఎడిటింగ్) ఈ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక.
ఎలాంటి RAM ఎంచుకోవాలి? –
DDR4 లేదా LPDDR4x/LPDDR5 (మొబైల్ కోసం) ర్యామ్ సెలెక్ట్ చేసుకోవటం బెటర్. ఈ ర్యామ్ వేరియంట్లు స్పీడ్ గా హై ప్రాసెసర్ తో పనిచేస్తూ డివైస్ పనితీరును మెరుగుపరుస్తాయి. ర్యామ్ స్పీడ్ కూడా ముఖ్యమైనది. ఆపరేటింగ్ సిస్టమ్, యాప్‌లను ఆపరేట్ చేయగలిగే బెస్ట్ ర్యామ్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నిజానికి ఉద్యోగం బట్టి ర్యామ్ ఎంచుకోవడం సరైన ఎంపిక. ఎక్కువ గేమింగ్ లేదా ప్రొఫెషనల్ పనులు చేస్తుంటే, హై స్టోరేజ్ RAM కలిగిన డివైజ్ లను కొనుగోలు చేయవచ్చు. అంటే 6GB లేదా 8GB మొబైల్, 16GB లేదా 32GB ల్యాప్‌టాప్ స్టోరేజ్ ఆఫ్షన్ సరైన ఎంపిక. ఇక సాధారణ పనుల కోసం, చిన్న RAM (2GB – 4GB మొబైల్, 4GB-8GB ల్యాప్‌టాప్) సరిపోతుంది. యూజర్ అవసరాలను బట్టి బెస్ట్ ర్యామ్ (RAM) ను ఎంపికను చేసుకోవచ్చు!
ALSO READ : ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ తో మోదీ భేటీ.. భారత్ ఏఐ రంగాన్నే పెను మార్పులు తీసుకురానుందా!