BigTV English

Lavanya Case : బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య… మస్తాన్ కేసులో మరో ట్విస్ట్

Lavanya Case : బిగ్‌ బాస్ కంటెస్టెంట్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య… మస్తాన్ కేసులో మరో ట్విస్ట్

Lavanya Case : గత ఏడాది లావణ్య ( Lavanya), రాజ్ తరుణ్ (Raj Tarun) కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజులు మీడియా కూడా వీరి విషయంపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది. అయితే ఈ ఏడాది మొదట్లో లావణ్య 2.0ని చూస్తారని అందరి గుట్టు బట్టబయలు చేస్తానంటూ లావణ్య మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. ఇక తాను చెప్పినట్టుగానే నిన్న మస్తాన్ సాయి (Mastan Sai) ని అరెస్టు చేయించిన ఈమె, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా (RJ shakar basha) పై ఫిర్యాదు చేసింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆమె శేఖర్ భాషా పై ఫిర్యాదు చేస్తూ.. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా తన ఫిర్యాదులో తెలిపింది. మస్తాన్ సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను కూడా ఆమె అందజేశారు. ఏది ఏమైనా లావణ్య రంగంలోకి దిగి ఆధారాలన్నీ పోలీసులకు సమర్పిస్తుండడంతో.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్..

ఆర్జే శేఖర్ బాషా పై ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లావణ్య, మళ్ళీ మస్తాన్ సాయిపై ఇంకో కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇద్దరూ కలిసి డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని ప్రయత్నం చేశారంటూ ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించిన ఈమె, వారిద్దరూ మాట్లాడుకున్న ఆడియోలను కూడా పోలీసులకు అందించింది. తనతోపాటు మరో యువతిని కూడా ఇందులో ఇరికించే ప్లాన్ చేశారంటూ ఆరోపించిన లావణ్య.. 150 గ్రాముల ఎండిఎంఏ తెస్తాను అని శేఖర్ భాషాతో మస్తాన్ సాయి చెప్పిన ఆడియోని ఆమె వినిపించింది. కాకపోతే లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయమని , పార్టీలో డ్రగ్స్ పెట్టి లావణ్యను, మరో యువతిని ఇరికిద్దామని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లు కూడా ఆడియోలో ఉన్నట్లు లావణ్య తరఫు న్యాయవాది నాగూర్ బాబూ వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు..

ముఖ్యంగా ప్రేమ, కావ్యంగా పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబరుచుకొని వారిని డ్రగ్స్ కి బానిసలను చేసి, రూమ్లో కెమెరాలు పెట్టి నగ్నంగా వీడియోలను చిత్రీకరించి, ఆ వీడియోలన్నింటిని ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేశారు మస్తాన్ సాయి. ఇక తనను కూడా అలాగే నగ్నంగా వీడియో తీశారని ఆ వీడియో డిలీట్ చేయమని మస్తాన్ సాయిని లావణ్య అడగగా.. అతడు చంపేస్తానని బెదిరించారట. ఈ మేరకు ఆ హార్డ్ డిస్క్ ను సొంతం చేసుకున్న ఈమె తన వీడియోని డిలీట్ చేయాలని చూస్తున్న క్రమంలో దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోలు అందులో ఉన్నట్లు గుర్తించింది. ఇక ఆ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది. ఈ మేరకు నిన్న నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×