BigTV English
Advertisement

OpenAI : ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ తో మోదీ భేటీ.. భారత్ ఏఐ రంగాన్నే పెను మార్పులు తీసుకురానుందా!

OpenAI : ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ తో మోదీ భేటీ.. భారత్ ఏఐ రంగాన్నే పెను మార్పులు తీసుకురానుందా!

OpenAI : ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మన్ (OpenAI CEO Sam Altman), ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే భేటీకానున్నారు. ఈ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది.


ప్రధాని మోదీ, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ తో ఈ వారంలో భేటీ కానున్నారు. ఈ భేటీ భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త దశను ప్రారంభించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారత్ AI రంగంలో లీడర్ గా మారేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఈ నేపథ్యంలో OpenAI వంటి గ్లోబల్ కంపెనీల CEO తో చర్చలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భేటీలో ఏ ఏ అంశాలు చర్చించే అవకాశం ఉందంటే –


AI development and ethics : AI ప్రపంచంలో ఎలా అభివృద్ధి చెందుతుందో, దాని ద్వారా వచ్చిన సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో, AI ని సమర్థవంతంగా, నైతికంగా ఎలా అభివృద్ధి చేయాలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. భారత్ లో OpenAI నుండి AI సంబంధిత మార్గదర్శకాలపై పలు సూచనలు తీసుకునే అవకాశం ఉంది.

Collaboration on research : భారత్, ఓపెన్ ఏఐతో కలిసి AI పరిశోధనలో కొత్త అవకాశాలను సాధించేందుకు చర్చలు జరపవచ్చు. భారతదేశంలో ఉన్న  AI నిపుణులతో ఓపన్ ఏఐ కలిసి పనిచేసే అవకాశాలు రావొచ్చు.

Regulation and policy frameworks : AI రంగం అభివృద్ధి చెందుతుండగా, ప్రభుత్వం దాని నియంత్రణకు సంబంధించి సరైన విధానాలు సృష్టించేందుకు ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. OpenAI, ఇతర అంతర్జాతీయ కంపెనీలతో చేసిన చర్చలు భారతదేశానికి AI రంగంలో సరైన ప్రణాళికలు రూపొందించేందుకు సహాయపడే అవకాశం కనిపిస్తుంది.

Skill development : ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా AI రంగం విస్తరించడంతో, భారత్ ఆ రంగంలో సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరుచునే దిశగా దృష్టి సారించే అవకాశం ఉంది. OpenAI అందించిన అవగాహన, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ భారత్ AI రంగంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇంతకు ముందు OpenAI ప్రతినిధులు ఇతర సంస్థలతో AI అభివృద్ధిపై చర్చలు నిర్వహించారు. అయితే తాము తీసుకునే నిర్ణయాలు, ఓపెన్ ఏఐపై నియంత్రణ విధానాలు ఎలా ఉండాలో చర్చించినట్లు తెలుస్తుంది.

గత కొన్నాళ్లుగా భారత్ సైతం ఏఐ రంగంలో తనదైన ముద్ర వేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. AI రంగం కోసం ప్రభుత్వం ఇటీవలే “జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహం” వంటి పథకాలను సైతం ప్రవేశపెట్టింది. ఇందులో AI ను అన్ని విభాగాలలో అభివృద్ధి చేయడం, ప్రతిభ గల వర్క్‌ఫోర్స్‌ను తయారుచేయడం, AI పరిశోధనకు మరింత ప్రోత్సాహం ఇవ్వడం వంటి లక్ష్యాలను ఏర్పరుచుకుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ భవిష్యత్తులో, India – OpenAI భాగస్వామ్యం, వాటి ద్వారా వచ్చే పరిశోధన, పెట్టుబడులు AI రంగంలో మరిన్ని మార్పులు  తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ALSO READ : ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. యాపిల్ మరీ ఇంత చీప్ అయిపోయిందా భయ్యా!

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×