Realme GT 7 Discount| త్వరలోనే భారీ గేమింగ్ ఫీచర్లతో రియల్ మి GT 8 ప్రో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ కారణంగా.. దాని ముందు వెర్షణ్ రియల్ మి GT 7 ప్రో ధర చాలా తగ్గింది. ఇప్పుడు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఈ ఆఫర్ అందేబాటులో ఉంది. పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం.
పెద్ద డిస్కౌంట్ రియల్ మి GT 7 ప్రో ప్రారంభ ధర రూ. 59,999. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ధర రూ. 44,999 తగ్గింది. అంటే నేరుగా రూ. 15,000 డిస్కౌంట్. ఇంకా, SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ అన్ని కలిపి ధర రూ. 41,586 వరకు తగ్గిపోయింది. మొత్తం రూ. 18,000పైగా సేవింగ్స్ చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ మంచి ఎక్స్‌చేంజ్ స్కీమ్ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి గరిష్టంగా రూ. 41,000 వరకు ఎక్స్‌చేంజ్ విలువ పొందవచ్చు. కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ఇస్తే, గరిష్ట డిస్కౌంట్ ఖాయం. ఫలితంగా, కొత్త ఫోన్ దాదాపు టోకెన్ ధరకు దక్కుతుంది. యాప్‌లో మీ పాత ఫోన్ విలువ ముందుగా నిర్ధారించుకోండి.
ఈ ఫోన్.. ప్రధాన ఆకర్షణలలో ఒకటి 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. HDR10+ Dolby Vision కంటెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 6500 నిట్స్ వరకు పెరుగుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనివల్ల భారీ గేమ్‌లు, హెవీ సాఫ్ట్‌వేర్‌లు సులభంగా రన్ అవుతాయి. టెన్షన్ ఏమీ లేకుండా టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ట్రిపుల్ కెమెరా సెటప్ వివిధ అవసరాలకు సరిపోతుంది. ప్రధాన 50MP సెన్సార్ మైనర్ డీటైల్స్ తో ఫోటోలు తీస్తుంది. 50MP టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. 8MP అల్ట్రావైడ్ కెమెరా ఎక్కువ ఏరియాను కవర్ చేస్తుంది. ఫ్రంట్ 16MP కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగుంటుంది.
5800mAh పెద్ద బ్యాటరీతో వస్తుంది. రోజుంతా మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 120W అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్. తక్కువ సమయంలోనే ఫుల్ చార్జ్ అవుతుంది. ఎప్పుడూ ప్రయాణంలో ఉండేవారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్.
రియల్ మి GT 7 ప్రో మూడు కలర్స్‌లో లభిస్తుంది. మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే, వైట్. ఈ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫోన్ అద్భుతమైన ఆఫర్. గేమర్లు, పవర్ యూజర్లు ఇది బాగా ఉపయోగపడుతుంది. డబ్బు, సమయం ఆదా చేసుకోవాలంటే ఇప్పుడే కొనండి. ఈ ఆఫర్ మిస్ కాకండి!
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే