OTT Movie : కొన్ని స్టోరీలు వినడానికే అదోలా ఉంటాయి. సొంత మనుషులు కూడా ఇంత దుర్మార్గంగా ఉంటారా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఆస్ట్రియాలో 1984లో జరిగిన ఎలిసబెత్ ఫ్రిట్జల్ అనే మహిళ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయబడింది. ఒక తండ్రి కూతుర్ని బేస్‌మెంట్‌లో బందీ చేసి, దాదాపు 24 సంవత్సరాలు నరకం చూపించిన ఒక భయంకర కథ ఇది. ఈ సినిమా పేరు ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘గర్ల్ ఇన్ ది బేస్‌మెంట్’ (Girl in the basement) 2021లో వచ్చిన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఎలిసబెత్ రోమ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో స్టెఫానీ స్కాట్, జడ్ నెల్సన్, జోలీ ఫిషర్, ఎమ్మా మయర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 26 విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, డిస్నీ+లో స్ట్రీమింగ్‌లో ఉంది. IMDbలో 6.3/10 రేటింగ్ ని కూడా పొందింది.
సారా అనే 17 ఏళ్ల అమ్మాయి, తన 18వ పుట్టినరోజు కోసం ఎదురుచూస్తుంటుంది. ఎందుకంటే ఆమె తన తండ్రి డాన్ నుంచి దూరంగా వెళ్లి, స్వేచ్ఛగా జీవించాలనుకుంటుంది. డాన్ చాలా కఠినంగా, శాడిస్ట్ లా బిహేవ్ చేస్తుంటాడు. సారాను ఎప్పుడూ కంట్రోల్ చేస్తుంటాడు. సారా తన స్నేహితులతో సమయం గడుపుతూ, తండ్రితో గొడవలు పడుతుంది. ఆమె 18వ పుట్టినరోజు రోజున, ఆమెకు హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పి, అతను ఇంటి బేస్‌మెంట్‌లోకి తీసుకెళ్తాడు. హఠాత్తుగా అతను సారాను ఒక గదిలో లాక్ చేస్తాడు. బేస్‌మెంట్‌ను డాన్ ఒక షెల్టర్ తయారు చేశాడు. అక్కడి నుంచి ఎలాంటి శబ్దం బయటికి వెళ్లకుండా ఉంటుంది. సారా అరిచినా, ఎవరూ వినలేరు. ఇక ఆమె అక్కడ బందీ అవుతుంది. బేస్‌మెంట్‌లో బందీగా ఉన్న సారాకు డాన్ భోజనం, మందులు ఇస్తాడు. కానీ బయటకు మాత్రం వదలడు.
Read Also : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్
ఇక అతని అసలు రూపం చూపిస్తాడు. డాన్ ఆమెను సెక్సువల్‌గా వేధిస్తాడు. దీంతో సారా గర్భిణి అవుతుంది. మొదటి సారి మేరీ అనే బిడ్డ పుడుతుంది. డాన్ మేరీని బయటకు తీసుకెళ్లి, తన భార్య ఇరీన్‌కు ఎక్కడో దొరికిందని చెప్తాడు. ఆమె సారా మిస్సింగ్ అని అనుకుంటుంది. సారా రెండో పిల్ల మైఖేల్ కూడా బేస్‌మెంట్‌లో పుడతాడు. సారా దాదాపు 20 సంవత్సరాలు బేస్‌మెంట్‌లో బందీగా ఉంటూ, తన పిల్లల కోసం బతుకుతుంది. ఆమె అక్కడి నుంచి తప్పించుకోలేక పోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, సారా పిల్లలు టీనేజ్ కి వస్తారు. మేరీకి ఆస్తమా వస్తుంది, ఆమె డాన్ తో తీవ్రంగా గోడవపడి, హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెబుతుంది. డాన్ భయపడి, మేరీని హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ మేరీ పోలీసులకు తన గురించి అతి కష్టం మీద పోలీసులకు చెబుతుంది. పోలీసులు డాన్‌ను అరెస్ట్ చేస్తారు. ఈ కథ ఇలా ముగుస్తుంది.