Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. కానీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇంకా పడుతూనే ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో మాములు వర్షం కురుస్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం సూచించినట్లుగా బాపట్ల నుండి అమలాపురం వరకు గల మొత్తం మధ్య ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షం కురుస్తోంది. వచ్చే 1 గంటలో, ఈ వర్షాల వలన మచిలీపట్నం – నర్సాపురం – అమలాపురం ప్రాంతంలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీలో వాతావరణ ఇలా..
ఏపీలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం సూచించినట్లుగా బాపట్ల నుండి అమలాపురం వరకు గల మొత్తం మధ్య ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షం కురుస్తోంది. వచ్చే 1 గంటలో, ఈ వర్షాల వలన మచిలీపట్నం – నర్సాపురం – అమలాపురం ప్రాంతంలో మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు..
తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు కురిసాయి. ఇప్పుడు కాస్త తగ్గాయి అనుకుంటే మళ్లీ వర్షాలు వస్తున్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 23 నుంచి 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌లలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి..
Also Read: వరుస సెలవులు.. పండుగ వేళ ఐదు రోజులు బ్యాంకులు బంద్!
జాగ్రత్తలు..
ఈ నెల మొత్తంగా వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని.. అలాగే మత్స్య కారులు వేటకు వెళ్లకూడదని అధికారులు తెలిపారు.