Samsung Galaxy S24 vs Samsung Galaxy S25 : సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శామ్సంగ్.. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో బెస్ట్ మెుబైల్ సిరీస్ అయిన S సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా గెలాక్సీ S25, Galaxy S25 ప్లస్, Galaxy S25 అల్ట్రాలను లాంఛ్ చేసింది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌ను సైతం తీసుకొచ్చేసింది. అయితే ఈ కొత్త సిరీస్ లో Galaxy S24తో పోలిస్తే ఎలాంటి అప్ గ్రేడ్స్ తీసుకువచ్చింది. అసలు ఇప్పటికే Galaxy S24 వాడుతున్న యూజర్స్ మెుబైల్ ను Galaxy S25 సిరీస్ కు అప గ్రేడ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఓ సారి చూసెద్దాం.
Samsung Galaxy S24 vs Galaxy S25 Specifications –
నిజానికి Galaxy S25 సిరీస్ Galaxy S24 సిరీస్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే Galaxy S25 లో డిజైన్, చిప్‌సెట్, AI ఫీచర్లలో మార్పులు తీసుకువచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్తగా ప్రారంభించబడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. అయితే గెలాక్సీ S24 స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వచ్చేసింది. కాగా ఇండియాలో ఇది Exynos 2400తో పనిచేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. Galaxy S25 Android 15 ఆధారంగా One UI 7పై నడుస్తుంది. అయితే Galaxy S24 Android 14 ఆధారంగా One UI 6పై నడుస్తుంది.
S25 అధునాతన రే ట్రేసింగ్, వల్కాన్ API ఫీచర్స్ తో వచ్చేసింది. అయితే S24లో ఈ లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో లేవు. గెలాక్సీ S25 మృదువైన అంచులతో పాటు సన్నని బెజెల్‌లను కలిగి ఉంది. అయితే గెలాక్సీ S24 ఇందుకు భిన్నంగా ఉంటుంది.
కెమెరా ఫీచర్ల విషయానికొస్తే.. Galaxy S25 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3X టెలిఫోటో కెమెరాలతో సహా Galaxy S24 వలె అదే కెమెరా హార్డ్‌వేర్ డిజైన్ తో వచ్చేసింది. అయితే Galaxy S25ను మెరుగైన లో లైట్ ఫోటోగ్రఫీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ తో తీసుకొచ్చేసింది. ఈ రెండు మెుబైల్స్ లో 4000mAh బ్యాటరీ సామర్థ్యంతోనే వచ్చేశాయి.
Galaxy S25 డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2340 x 1080 (FHD+) రిజల్యూషన్, 16M కలర్ డెప్త్‌తో 6.2 అంగుళాల OLEDతో Galaxy S24 ఫీచర్స్ మాదిరిగానే వచ్చేశాయి. Galaxy S25, Galaxy S24 మెుబైల్స్ లో డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్2, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
ఈ రెండు ఫోన్‌లు కనెక్టివిటీ పరంగా విభిన్నంగా ఉంటాయి. సామ్సాంగ్ గెలాక్సీ S25లో Wi-Fi 7, బ్లూటూత్ 5.3 ఫీచర్స్ ఉన్నాయి.అయితే Galaxy S24 Wi-Fi 6, బ్లూటూత్ 5.2 ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ మెుబైల్స్ ధర విషయానికి వస్తే.. Galaxy S25 రూ. 80,999తో ప్రారంభమవుతుంది. కాగా Galaxy S24 ప్రారంభ ధర రూ. 79,999
ALSO READ : సామ్సాంగ్ ఎడ్జ్ సిరీస్.. ఈ స్లిమ్ మెుబైల్ ఫీచర్స్ కిర్రాక్ అంతే!