Instagram : ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టా సేవల్లో సాంకేతిక ఇబ్బందులు ప్రారంభమైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో యూజర్స్ కంప్లైంట్ చేయడంతో పాటు ఇప్పటికే యాక్టివర్స్ మీమ్స్ కూడా మొదలు పెట్టేశారు.
అసలు ఏం జరిగిదంటే? – మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టా గ్రామ్ సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొండటం వల్ల వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్టా మాతృ సంస్థ మెటాకు ఎక్స్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇన్ స్టాలో డైరెక్ట్ సందేశాలను పంపడంలో, యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుపుతున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టా గ్రామ్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌తో యూజర్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తున్నారు యూజర్స్. కొందరు అయితే అప్పుడే మీమ్స్ కూడా మొదలు పెట్టేశారు. దీనిపై ఇప్పటికైతే ఇన్‌స్టా అధికారికంగా స్పందించలేదు.
సోషల్ మీడియా సర్వీస్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్ డెటెక్టర్ వెబ్‌సైట్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. అయితే ఈ సమస్య ప్రభావిత వినియోగదారుల వాస్తవ సంఖ్య మారొచ్చు. ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ సమస్య మంగళవారం సాయంత్రం 5.14 గంటల నుంచి మొదలైనట్లు వెబ్‌సైట్ తెలిపింది.
డౌన్ డెటెక్టర్ ప్రకారం 48 శాతం మంది వినియోగదారులు ఇన్‌స్టా యాప్ సాంకేతిక సమస్య గురించి రిపోర్ట్ చేస్తున్నారు. 27 శాతం మంది కంటెంట్ షేరింగ్ చేయడంలో ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 25 శాతం సర్వర్‌కు కనెక్ట్ కావట్లేదని అంటున్నారు.
రియాక్షన్స్ – ‘ఇన్‌స్టా గ్రామ్ డౌన్ అయింది. మెసేజ్స్ సెండ్ చేయలేకపోతున్నా.’ ‘ఇన్‌స్టాపై డైరెక్ట్ మెసేజ్‌లు వెళ్లడం లేదు. నాకు మాత్రమే ఈ సమస్యా, లేదంటే ఇతరులకు కూడా ఉందా?’, ‘మెసెజ్‌లు డెలివరీ అవ్వట్లేదు. సెండ్ చేసిన కాసేపటికి ఫెయిల్ అని చూపిస్తోంది.’ అని కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలోనూ సాంకేతిక సమస్య కారణంగా ఏర్పడిన అంతరాయం వల్ల లక్షలాది మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ప్రపంచవ్యాప్తంగా రెండు గంటలకు పైగా ప్రభావితమయ్యారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం ఇప్పటివరకు ఫేస్‌బుక్‌కు 550,000 కంటే ఎక్కువ అంతరాయాల నివేదికలు, ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు 92,000 నివేదికలు వచ్చాయి.
ఇక గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఇన్ స్టా నిలిచిపోయిందంటూ పలువురు ఖాతాదారులు ఫిర్యాదు చేశారని డౌన్ డిటెక్టర్ అనే వెబ్ సైట్ బహిరంగంగా వెల్లడించింది. అమెరికాలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని.. దాదాపు 46 వేల మంది యూజర్లు ఈ సమస్య ఎదుర్కున్నారని తెలిపింది. ఆ సమయంలో సైతం ఈ అంతరాయానికి కారణమేంటనే విషయాన్ని మెటా వివరించలేదు. ఇక ప్రస్తుతం జరిగిన విషయంపై సైతం మెటా స్పందించకపోవటం తీవ్ర చర్చకు దారి తీసింది.
ALSO READ : ‘డిజిటల్ కండోమ్’.. భయం లేని ఏకాంతం కోసం సరికొత్త యాప్!