Ashok Galla: సర్ సర్లే ఎన్నో అనుకుంటాం.. అన్ని అవుతాయా.. ఏంటి.. ? అని తమ మనసుకు తామే సర్దిచెప్పుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. నిన్నటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు .. దేవకీనందన వాసుదేవ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు.
మంచి పవర్ ఫుల్ కథను అందించడంతో.. క్లైమాక్స్ లో మహేష్.. శ్రీకృష్ణుడుగా కనిపించనున్నాడని, ప్రశాంత్ వర్మ.. ఈ పాత్రను ఎంతో పవర్ ఫుల్ గా రాసాడని టాక్ నడిచింది. క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడి ఉగ్రస్వరూపం షాట్ ఉంటుందట.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. అసలు మహేష్ .. శ్రీకృష్ణుడు అనే వార్త వినపడగానే.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ట్విట్టర్ లో రచ్చ చేశారు. చివరకు ఈ వార్త మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా వరకు చేరింది. ఈ పుకారుపై అశోక్ స్పందించాడు.
Rana Daggubati: నా జుట్టు ఒరిజినల్ కాదు.. ఎంత నిజాయితీగా చెప్పావ్ బాసూ.. హ్యాట్సాఫ్
మహేష్ బాబు తన సినిమాలో ఎలాంటి క్యామియో చేయడం లేదని చెప్పి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లాడు. “అందరికీ నమస్కారం, మా సూపర్‌స్టార్‌పై వచ్చిన పుకార్లపై వెంటనే స్పందించనందుకు క్షమాపణలు చెప్తున్నాను. మహేష్ మామయ్య నా సినిమా దేవకీ నందన వాసుదేవలో శ్రీకృష్ణుడిగా అతిధి పాత్రలో నటిస్తున్నాడు అంటూ వచ్చిన ఈ వార్త పూర్తిగా అబద్ధం. ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు వ్యాపించడంతో నేను చాలా నిరాశ చెందాను. ఈ వార్తపై ఇంత ఆలస్యంగా స్పందించినందుకు క్షమించండి.
నేను ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో తదుపరి చిత్రం కోసం షూటింగ్ చేస్తున్నాను. అందుకే సోషల్ మీడియాలో ఈ స్ప్రెడ్‌ని చూడటం పూర్తిగా మిస్ అయ్యాను. స్పష్టంగా చెప్పాలంటే, నా సినిమాల్లో ఏదైనా అలాంటి అతిధి పాత్ర నిజంగా ఉంటే మొదట నేనే ఆ విషయాన్ని మీకు చెప్తాను. చివరగా, దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని అభ్యర్థిస్తున్నాను. ఇది కొందరిని నిరాశపరిచినప్పటికీ, మా సినిమా నిరాశపరచదని నేను విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు. మేము మళ్ళీ థియేటర్లలో కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Unstoppable With NBK: లక్కీ భాస్కర్ టీమ్ తో రచ్చ లేపిన బాలయ్య.. హైలైట్ అంటే ఆ ప్రశ్నే..
ఇక ఈ వార్త విన్న మహేష్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశపడినా.. ఇప్పటికైనా నిజం చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ రిలీజ్ కానుంది. పెద్ద సినిమాలు అయిన కంగువ, మట్కాలతో పోటీపడడానికి రెడీ అవుతుంది. మరి వారితో పోటీపడి సూపర్ స్టార్ మేనల్లుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Hi everyone, my apologies for not responding immediately to the rumors about our superstar @urstrulyMahesh mamayya doing cameo role as lord Krishna in my film Devaki Nandana Vasudeva.
This news is absolutely false! I’m also very disappointed that such misleading news has spread…
— Ashok Galla (@AshokGalla_) October 29, 2024