Instagram Friend Map| భారతదేశంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. దీని పేరు “ఫ్రెండ్ మ్యాప్”. ఈ ఫీచర్ ప్రస్తుతానికి పరిమిత యూజర్ల కోసమే భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది స్నాప్‌చాట్‌లోని స్నాప్ మ్యాప్ లాంటిది, ఇది మీ స్నేహితుల లొకేషన్ (రియల్-టైమ్‌లో) చూడటానికి అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా మీరు మీ స్నేహితులతో కలిసి హ్యాంగౌట్ స్పాట్‌లను కనుగొనవచ్చు లేదా మీ లొకేషన్ ని ఎంచుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్.. యూజర్ల ప్రైవెసీ పట్ల ఆందోళనలను కూడా లేవనెత్తుతోంది.
ఫ్రెండ్ మ్యాప్ అంటే ఏమిటి?
ఫ్రెండ్ మ్యాప్ స్నేహితులు నేరుగా కలుసుకోవడాన్ని సులభతరం చేయడానికి రూపొందించబడింది. మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ స్పాంటేనియస్ మీటప్‌లను సులభంగా ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది. మీరు ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తేనే మీ స్నేహితులు మీ లొకేషన్ ని చూడగలరు. ఈ ఫీచర్ సోషల్ రిలేషన్స్ ని సంబంధాలను మెరుగుపరుస్తుంది, కానీ ప్రైవెసీ సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.
ఫ్రెండ్ మ్యాప్ ప్రధాన లక్షణాలు
రియల్-టైమ్ లొకేషన్ షేరింగ్: మీరు.. మీ స్నేహితులు లొకేషన్ షేరింగ్ ఆన్ చేస్తే.. మీరు ఒకరి స్థానాన్ని వెంటనే చూడవచ్చు.
యాక్టివిటీ ఆధారిత లొకేషన్ లాగింగ్: ఇన్‌స్టాగ్రామ్ యాప్ తెరిచినప్పుడు లేదా పోస్ట్‌లు, స్టోరీలలో లొకేషన్ ట్యాగ్ చేసినప్పుడు మీ లొకేషన్ రికార్డ్ అవుతుంది.
లొకేషన్ హిస్టరీ: ఈ మ్యాప్ మీ గత లొకేషన్ల టైమ్‌లైన్‌ను సృష్టిస్తుంది.
మెటా ఇకోసిస్టమ్ ఇంటిగ్రేషన్: ఈ ఫీచర్ ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి మెటా అందించే ఇతర సేవలతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది.
ఫ్రెండ్ మ్యాప్‌ను ఎలా ఉపయోగించాలి?
ఇన్‌స్టాగ్రామ్ యాప్ తెరిచి, మెసేజెస్ సెక్షన్‌కు వెళ్లండి.
అక్కడ మ్యాప్ సెక్షన్‌ను కనుగొనండి.
“టర్న్ ఆన్” ఎంచుకొని, మీ లొకేషన్‌ను ఎవరితో పంచుకోవాలో ఎంచుకోండి.
మీరు ఎప్పుడైనా లొకేషన్ షేరింగ్‌ను పాజ్ చేయవచ్చు లేదా ఆపవచ్చు.
ఎవరు ఉపయోగించవచ్చు?
ఈ ఫీచర్ భారతదేశంతో సహా కొన్ని దేశాలలో క్రమంగా విడుదల అవుతోంది. ఇది ఆప్ట్-ఇన్ ఫార్మాట్‌లో ఉంది, అంటే మీరు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే మీ లొకేషన్ కనిపిస్తుంది.
ఫ్రెండ్ మ్యాప్ ప్రయోజనాలు
ప్రైవెసీ, భద్రతా సమస్యలు
నిపుణులు ఈ ఫీచర్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దీని వల్ల ప్రమాదం పొంచి ఉంది.
స్టాకింగ్ బెదిరింపులు: అపరిచితులు మీ చెక్-ఇన్‌ల ద్వారా మీ కదలికలను ట్రాక్ చేయవచ్చు.
పర్సనల్ రొటీన్ బహిర్గతం: తరచూ చెక్-ఇన్ చేస్తే, మీ జీవన విధానం ప్రయాణ రొటీన్ బయటపడవచ్చు.
డేటా ఉపయోగం: మీ లొకేషన్ డేటాను మెటా టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ లేదా విశ్లేషణ కోసం ఉపయోగించవచ్చు.
ఎన్క్రిప్షన్ లేదు: ఈ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడదు. అందుకే హ్యాకింగ్ లేదా డేటా దుర్వినియోగం జరిగితే ప్రమాదం ఉంది.
మెటా అసలు టార్గెట్ అదే
మెటా ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం ఫోటో-షేరింగ్ యాప్‌గా కాకుండా, నిజ జీవితంలో సంబంధాలను మెరుగుపరిచే అనుభవంగా మార్చాలని కోరుకుంటోంది. ఇది డిజిటల్‌గా నిజ జీవిత సంబంధాలను మార్చడానికి అడ్వర్టైజింగ్ కోసం మెరుగైన అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ఫీచర్ ప్రైవెసీ, డేటా సెక్యూరిటీ లేకపోతే ఈ యాప్‌లు సురక్షితంగా ఎలా ఉపయోగించాలనే ప్రశ్నలను లేవనెత్తుతుంది.
Also Read: ఆపిల్ కంపెనీ బంపర్ ఆఫర్.. ఆ పని చేసినవారికి రూ 17.5 కోట్లు బహుమతి!