Independence Day: దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల్లో ప్రభుత్వం అధికారులు ఉదయాన్నే జాతీయ జెండాలను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయగీతం ఆలపించారు. పిల్లకు, పెద్దలకు స్వీట్స్ పంచుతున్నారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజు పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకి అవమానం జరిగింది.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెన్నూరు నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఉదయం తహసీల్దార్ తో సహా అధికారులు హాజరయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం జెండా ఎగురవేయగా జాతీయ జెండా తలక్రిందులుగా ఎగిరింది. అది గమనించకుండా తహసీల్దార్ సదానందం సెల్యూట్ చేస్తూ జాతీయ గీతం ఆలపిస్తూ జెండా వైపు చూడగా జెండా తలక్రిందులుగా ఉండటం చూసి అందరూ షాక్ తిన్నారు.
ప్రభుత్వం అధికారి అయి ఉండి తహసీల్దార్ విధులు నిర్వహిసున్న సదానందంపై విమర్శలు వెల్లువెత్తాయి. తహసీల్దార్ జెండా తలక్రిందులుగా ఉందని చూసి కూడా జాతీయ గీతాలాపన చేయడం ఏంటని మండిపడుతున్నారు. అది సరిచేయాలని అక్కడున్న అధికారులకు తెలుపడంతో కొందరు జాతీయ జెండాను కిందికు తీసి మళ్లీ సరిచేసినట్లు సమాచారం. అయితే జాతీయ జెండాని తల క్రిందులుగా ఎగురవేసిన తహసీల్దార్ పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.