BigTV English

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

Congress: మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుస ట్వీట్‌లతో అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తున్నారు . మంత్రి పదవి ఇస్తానని నమ్మించి మోసం చేసారని, 20నెలలు ఓపిక తో చూశానని ఇక ఓపిక నశించిందని సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.


తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయనకు ఒకటికి రెండు సార్లు మంత్రి పదవి కట్టబెట్టతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పటి ఇరవై నెలలు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదు. తొలి మంత్రివర్గం ఏర్పాటులో రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. ఏడాది తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ రాజగోపాల్‌‌రెడ్డికి స్థానం దక్కలేదు.


హామీ ఇచ్చే ముందు సోదరులమని తెలియదా అంటున్న రాజగోపాల్

కోమటిరెడ్డి సోదరులు ఇద్దరికీ మంత్రి పదవులు అనేది జిల్లా, కుల సమీకరణల్లో భాగంగా కుదరటం లేదని కాంగ్రెస్ పెద్దలు కొందరు అభిప్రాయపడుతున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఆ క్రమంలో ఒకే జిల్లా నుంచి రెడ్డి సామాజికే చెందిన మూడో నేతకు ఎలా మంత్రి పదవి ఇస్తారన్న పాయింట్ లేవనెత్తుతున్నారు, అయితే పార్టీలో చేర్చుకుని హామీ ఇచ్చేముందు తెలియదా సోదరులమని, అలాగే పార్లమెంట్ ఎన్నికల సమయం లో కూడా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించి హామీ ఇచ్చినపుడు తెలియదా సోదరులమంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నారు .

ఖమ్మం జిల్లాలో 3 మంత్రి ఇవ్వలేదా అని వాదన

తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు మూడో మంత్రి పదవి ఇస్తే తప్పేంటని రాజగోపాల్‌రెడ్డి లాజిక్ లేవనెత్తుతున్నారు. ఖమ్మంకు ఒప్పు, నల్గొండకు తప్పా అని అటు అధిష్టానాన్ని, ఇటు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అలా అవకాశం దొరికినప్పుడల్లా తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. ఆయన స్థానిక ఎన్నికల ముందు అధికార పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేయడం, వరుస ట్వీట్ లు పెడుతుండటం కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా మారుతుండటంతో అధిష్టానానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

సీఎం రేవంత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్న వెంకటరెడ్డి

ఓ వైపు రాజగోపాల్ రెడ్డి ఇలా విరుచుకుపడుతుంటే సోదరుడు వెంకటరెడ్డి మాత్రం సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ మళ్లే నువ్వే రేవంతే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. సోదరునికి మంత్రి పదవి హామీ విషయం తనకు తెలియదని చెప్పుకొస్తున్నారు. అలా అన్న ఒకలా తమ్ముడు మరొకలా మాట్లాడటం ఎవరికీ అంతుపట్టడం లేదు . ఆ క్రమంలో ఇప్పుదు అందరి దృష్టి రాజగోపాల్‌రెడ్డిపై పడింది. ఆయన ఏం చేయబోతున్నారు అని ఆసక్తి గా గమనిస్తున్నారు . గతం లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వం పై కొట్లాడుతూ బీజేపీ లో చేరిన రాజగోపాల్ బైపోల్స్‌లో ఓడిపోయారు. అయితే అప్పుడు కోమాటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన వెర్షన్ తాను వినిపించారు. తన రాజీనామా తో ప్రభుత్వం దిగి వచ్చిందని, తనను ఓడించడానికి మునుగోడు నియోజకవర్గంలో అప్పటి ప్రభుత్వం వందల కోట్ల అభివృద్ధి చేపట్టిందని ప్రచారం చేసుకున్నారు . కాని ఇపుడు రాజీనామా బాట పడితే ఆయన ఏం చెప్పదల్చుకున్నారు? అధికారం లో ఉండి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని రాజీనామా చేసి ప్రజలకు ఎం చెప్తారు? అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. కేవలం భయపెట్టడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేక మరేదైనా వ్యూహమా అని ఎవరికి అంతు చిక్కడం లేదు .

అభివృద్ధి నిధులు ఆపవద్దని రాజగోపాల్ డిమాండ్

ఆ క్రమంలో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధిని ఫోకస్ చేస్తూ కొత్త వాయిస్ వినిపిస్తున్నారు. మంత్రి పదవిపై మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కాంగ్రెస్ పెద్దలకు సూచిస్తున్నారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీ అమలు ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు , ఎందుకు కుదరటం లేదు సమీకరణలు?.. రాకుండా ఎవరడ్డుకుంటున్నారని నిలదీస్తున్నారు. పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములమని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములమని.. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతున్నానని, మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: వాడపల్లి ఆలయానికి స్వాతంత్య్ర పోరాటానికి లింకేంటి?

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించని కాంగ్రెస్ పెద్దలు

ఏదేమైనా ఇప్పటి వరకు అధిష్టాన పెద్దలు కానీ క్రమశిక్షణ కమిటీ కానీ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎవరు స్పందించలేదు. పార్టీ పరంగా ఖండించడానికి కూడా ఎవరు ధైర్యం చేయని పరిస్థితి . అయితే ఇలాగే కొనసాగితే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రాజగోపాల్‌రెడ్డి విషయంలో ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందంట. ఇచ్చిన హామీని నెరవేర్చడమా లేక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాజగోపాల్‌కి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా తేల్చే పనిలో ఉందంట. మరి చూడాలి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లెక్కలు ఎలా మారతాయో?

Story By Ajay Kumar, Bigtv

Related News

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

AP Politics: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Big Stories

×