Big Stories

iPhone 16 Series: అదిరిపోతున్న ఐఫోన్ 16 ఫీచర్లు.. 15ను మించిపోయింది బాసూ!

iPhone 16 Series: తాజా ఐఫోన్ 15 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అవుతుంది. అయినప్పటికీ టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే iPhone 16, iPhone 16 Plusకు సంబంధించి డిజైన్, ఫీచర్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీని ప్రకారం మెరుగైన కెమెరా సామర్థ్యాల నుండి కొత్త బటన్‌లు, శక్తివంతమైన A-సిరీస్ చిప్‌లను ఫోన్‌లో చూడొచ్చు. iPhone 16, iPhone 16 Plus లీక్‌లు, ధర, లాంచ్ తేదీ ఇతర వివరాలను తెలుసుకోండి.

- Advertisement -

iPhone 16 Plus, iPhone 16 లాంచ్ తేదీ గురించి చెప్పాలంటే ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. iPhone 15 మోడల్‌ ఎప్పుడయితే మార్కెట్‌లోకి వచ్చిందో  iPhone 16 మోడల్‌లు కూడా సెప్టెంబర్ 2024లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.  ఈ ఐఫోన్ 16 ధర రూ. 1,20,000లుగా ఉండొచ్చు. కానీ ఈ ధరను ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. ఐఫోన్ 15 కంటే 16 తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: మోటో నుంచి సరికొత్త ఫోన్.. ఇది కొంటే కెమెరా అక్కర్లేదు!

ఐఫోన్ 16 లైనప్ డిజైన్ పరంగా పెద్ద మార్పుల ఏమి ఉండకపోవచ్చు. స్టోర్‌లో కొన్ని ముఖ్యమైన ట్వీక్‌లు ఉన్నాయి. కొత్త వర్టికల్ కెమెరా లేఅవుట్, వీడియో రికార్డింగ్ క్వాలిటీలో కొన్ని మార్పులు ఉంటాయి. కెమెరా లేఅవుట్‌తో పాటు, స్టాండర్డ్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండూ పిల్ ఆకారపు కెమెరా బంప్ హౌసింగ్ ప్రత్యేక వైడ్, అల్ట్రావైడ్ లెన్స్‌లను కలిగి ఉండొచ్చు.

ఐఫోన్ 16 లైనప్‌లో యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్‌లో మార్పులు ఉంటాయి. గతంలో iPhone 15 Pro మోడల్‌లకు ప్రత్యేకమైన యాక్షన్ బటన్ ఇప్పుడు అన్ని iPhone 16 మోడళ్లలో ఉంటుంది. ఫ్లాష్‌లైట్‌ని యాక్టివేట్ చేయడం నుండి షార్ట్‌కట్‌లవరకు వినియోగదారులకు వారి చేతివేళ్ల వద్ద అనేక రకాల ఫంక్షన్‌లను అందిస్తోంది. క్యాప్చర్ బటన్ ఐఫోన్‌లలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. వినియోగదారులను ఫోకస్ చేయడానికి, జూమ్ చేయడానికి, సులభంగా ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.

Also Read: వివో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు.. రూ.439 లకే దక్కించుకునే ఛాన్స్!

iPhone 16 లైనప్ తాజా N3E 3-నానోమీటర్ నోడ్‌పై Apple  తాజా A18 చిప్‌ల ద్వారా అందించబడుతుంది. వీటి పెర్ఫామెన్స్ గతంలో వచ్చిన ఐఫోన్ల కంటే చాలా బెటర్‌గా ఉంటుంది. వినియోగదారులు మెరుగైన వేగాన్ని ఆశించవచ్చు. ఇది ఫోన్‌ను స్మూత్‌గా రన్ చేస్తుంది. డిస్‌ప్లే టెక్నాలజీ, బ్యాటరీ ఐఫోన్ 16 మోడల్‌లు మైక్రో-లెన్స్ టెక్నాలజీతో కూడిన OLED ప్యానెల్‌లను కలిగి ఉన్నాయి.

ఈ ఫోన్ డిస్‌ప్లే ప్యానెల్ మంచి బ్రైట్‌నెస్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ పెంచుతుంది. అదనంగా, ఆపిల్ బోర్డర్ రిడక్షన్ స్ట్రక్చర్ (BRS) టెక్నాలజీ ఇందులో ఉంటుంది. దీని ఫలితంగా డిస్‌ప్లే మరింత ఫోకస్‌గా కనిపించే సన్నగా ఉండే బెజెల్‌లు లభిస్తాయి. బ్యాటరీ కోసం చాలా మోడల్‌లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News