E-Paper
Advertisement

వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఈ ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!

వచ్చేస్తోంది iPhone 18 Pro సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది కానీ, ఈ ఫోన్ రేటును తట్టుకోవడమే కష్టమే!
Advertisement

iPhone 18 Pro Max:

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ లవర్స్‌కు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న iPhone 18 Pro, 18 Pro Max మోడల్స్ ఈ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈసారి రాబోయే ఫోన్లలో మునుపెన్నడూ చూడని కొన్ని అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేయడానికి యాపిల్ ప్లాన్ చేస్తోంది.

కొత్త లుక్.. పవర్‌ఫుల్ ఫీచర్లు:

Advertisement

డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేకపోయినా.. ఈసారి డార్క్ చెర్రీ, లైట్ బ్లూ, డార్క్ గ్రే వంటి కొత్త రంగుల్లో ఈ ఫోన్లు రానున్నాయి. డిస్‌ప్లే పరిమాణాలు మారకపోయినా, స్క్రీన్ పైభాగంలో ఉండే ‘డైనమిక్ ఐలాండ్’ పరిమాణాన్ని దాదాపు 35 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల స్క్రీన్ మరింత పెద్దదిగా, స్పష్టంగా కనిపిస్తుంది.

కెమెరాలో DSLR మ్యాజిక్:

ఈ మోడల్స్‌లో రాబోతున్న ప్రధాన ఆకర్షణ ‘వేరియబుల్ అపెర్చర్’ కెమెరా టెక్నాలజీ. లైటింగ్‌ను బట్టి కెమెరా లెన్స్ దానంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. దీనివల్ల చీకట్లో తీసే ఫొటోలు, పోర్ట్రెయిట్ షాట్లు డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరాతో తీసినట్లే చాలా క్లియర్‌గా వస్తాయి.

Advertisement

Also Read: ఐఫోన్ 17, శాంసంగ్ S25పై భారీ ఆఫర్లు.. ఆ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ షురూ!

సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ:

ఈ కొత్త ఐఫోన్లలో అత్యంత శక్తివంతమైన A20 చిప్‌సెట్‌ను వాడనున్నారు. ఇది ఫోన్ వేగాన్ని పెంచడమే కాకుండా బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. Pro Max మోడల్‌లో ఏకంగా 5200mAh సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఛార్జింగ్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

ధర ఎంతంటే?

అయితే ఈ ఆకర్షణీయమైన ఫీచర్లన్నీ మన చేతికి అందాలంటే జేబు కాస్త ఖాళీ అవ్వాల్సిందే. కొత్త టెక్నాలజీ, విడిభాగాల ధరలు పెరగడం వల్ల ఈసారి Pro సిరీస్ ధరలు గణనీయంగా పెరగొచ్చని సమాచారం. భారత్‌లో ప్రసుతం ఉన్న మోడళ్లతో పోలిస్తే దాదాపు రూ.20,000 నుండి రూ.30,000 వరకు ధర ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Also Read: ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Vivo X300e.. పిచ్చెక్కించే లీక్డ్ ఫీచర్లు ఇవే!

Related News

రూ.500 లోపే అదిరిపోయే సౌండ్‌బార్.. తక్కువ ధరలో సూపర్ మ్యూజిక్

వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!

అల్యూమినియం బాడీ, 60 గంటల బ్యాటరీ.. Nothing Headphone (1) Pro ప్రత్యేకతలు ఇవే!

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

Big Stories

Advertisement
×