E-Paper
Advertisement

మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్‌లో ఘోరం

మార్కెట్‌పై డ్రోన్లతో దాడి.. ఏకంగా 100 మంది మృతి, సుడాన్‌లో ఘోరం
Advertisement

Drone Attacks: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దారుణంగా తయారవుతున్నాయి. దక్షిణ డార్ఫూర్ రాజధాని నయాలాలో రద్దీగా ఉండే మార్కెట్‌పై డ్రోన్ తో దాడి చేసింది సూడాన్ సైన్యం. ఈ ఘటనతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. మరో 113 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని హక్కుల సంఘం వెల్లడించింది.

సూడాన్ లో తీవ్రమవుతున్న అంతర్యుద్ధం

సుడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధంలో రోజు రోజుకూ జఠిలమవుతోంది. అక్కడి సైన్యం చేస్తున్న డ్రోన్ దాడులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతులేని ప్రజా నష్టం జరుగుతోంది. అయినా ఏ మాత్రం అక్కడి సైన్యం వెనక్కి తగ్గలేదు. తాజాగా దక్షిణ డార్ఫూర్ రాజధాని నయాలాలోని రద్దీగా ఉండే మార్కెట్‌పై డ్రోన్ దాడి చేసింది సైన్యం. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మరణించారు.

మార్కెట్ పై డ్రోన్ల దాడి, 100 మందికి పైగా మృతి

Advertisement

సుమారం 113 మందికి పైగానే గాయపడ్డారు. అక్కడ జరుగుతున్న హింసను పర్యవేక్షిస్తున్న ఎమర్జెన్సీ లాయర్స్ అనే బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. బాధితుల్లో చాలామంది మహిళలు, పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. దాడికి సూడాన్ సైన్యం కారణమని ఆరోపించింది. అంతేకాదు ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. దాడుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 12 గంటలకు పైగానే విద్యుత్ నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో నీటి సరఫరా స్తంభించి ప్రజలు రోడ్లపైకి వచ్చారు. చివరకు జనరేటర్లు, ఆసుపత్రులు, బేకరీలపై ఆధారపడ్డారు.

ఈ దాడి వల్ల వెనుక రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్-ఆర్‌ఎస్‌ఎఫ్ హస్తం ఉందని ఓ అధికారి ఆరోపణ. ఈ ఏడాది రెండో దాడని తెలిపారు. ఈ సిటీ ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎఫ్ నియంత్రణలో ఉందని, ఆసుపత్రికి 36 మృతదేహాలు వచ్చాయని తెలిపారు. మరో 150 మందికి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ స్వయంగా వెల్లడించింది. సూడాన్‌లో గడిచిన మూడేళ్ల నుంచి సైన్యానికి-పారా మిలటరీ గ్రూప్-ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మధ్య వార్ జరుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

ALSO READ: లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

 

Related News

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

Big Stories

Advertisement
×