E-Paper
Advertisement

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు
Advertisement

Virender Sehwag On Abhishek Sharma: న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (New Zealand vs India, 3rd T20I) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ( Abhishek Sharma) సూపర్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన క్రమంలో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ దెబ్బకు న్యూజిలాండ్ బౌలర్లు నిద్రపోవడం కష్టమేనని తెలిపారు.

అతని బ్యాటింగ్ తలుచుకొని న్యూజిలాండ్ బౌలర్లు నిద్రలోనూ ఉలిక్కిపడడం గ్యారెంటీ అని హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ను (Sachin Tendulkar) చూసి అందరూ బ్యాటింగ్ నేర్చుకునే వారని.. ఇప్పుడు అభిషేక్ శర్మ ( Abhishek Sharma) దూకుడును చూసి యంగ్ క్రికెటర్లు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒక్క సెంచ‌రీతో సచిన్ టెండూల్కర్ రేంజ్ కు అభిషేక్ శర్మ చేరుకున్నాడని వెల్లడించారు. అభిషేక్ శర్మను చూసి ప్రపంచ క్రికెట్ జట్లు అన్ని వణికిపోతున్నాయని తెలిపారు.

అభిషేక్ బ్యాటింగ్ త‌ల‌చుకుని, న్యూజిలాండ్ బౌల‌ర్లు నిద్ర‌లోనూ ఉలిక్కిప‌డ‌తారు

Advertisement

న్యూజిలాండ్ పై సూపర్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మపై ( Abhishek Sharma) వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించారు. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన టీ20 ప్లేయర్ అభిషేక్ శర్మ ఒక్కడేనని వ్యాఖ్యానించారు. చాలా మంది అభిషేక్ శర్మను కళ్ళు మూసుకొని స్లాగర్ అంటూ విమర్శలు చేశారని మండిపడ్డారు. కానీ న్యూజిలాండ్ గడ్డపై 35 బంతుల సెంచరీ చేయడంతో విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. అదే సక్సెస్ అన్నారు. మంచినీళ్లు తాగినంత సులభంగా అభిషేక్ శర్మ సిక్సర్లు బౌండరీ కొట్టడం గొప్ప విషయం అన్నారు. తాను కూడా గతంలో అభిషేక్ శర్మ లాగానే దూకుడుగా ఆడే వాడినని పేర్కొన్నారు. యువరాజు సింగ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ అయిన అభిషేక్ శ‌ర్మ ఇలాగే ముందుకు వెళ్లాలని సూచించారు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

అభిషేక్ శర్మ దెబ్బకు వైభవ్ జీరో అయిపోయాడు

Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టి20 సందర్భంగా అభిషేక్ శర్మ దూకుడు దెబ్బకు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జీరో అయిపోయాడని వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు పేల్చారు. వాస్తవంగా టీమిండియా మ్యాచ్ అంటే వైభవ్ సూర్యవంశీ కోసమే అన్నట్లుగా మ్యాచ్ చూస్తారని.. కానీ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తో డామినేట్ చేసినట్టు వివరించారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ హీరో కాగా వైభవ్ జీరో అయిపోయినట్టు తెలిపారు.

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

Related News

సానియా మీర్జా సంచ‌ల‌న నిర్ణ‌యం…మసీదు కోసం స్థ‌లం విరాళం ?

టీమిండియాలో అంద‌రూ రాక్ష‌సులే…వాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే ప్ర‌పంచ‌మే వ‌ణికిపోతోంది

అభిషేక్ శర్మలా ఆడాల‌ని పాకిస్తాన్ బ్యాట‌ర్లు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు

శ్రీలంక బ్యాట్లలో స్ప్రింగులు… చెక్ చేసిన బాబ‌ర్ ఆజం

టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేది

న్యూజిలాండ్ కంటే మేం నయం…టీమిండియాను చిత్తు చేశామంటూ డారెన్ సమీ విమర్శలు!

అభిషేక్ శర్మ సెంచరీ..కోహ్లీ 10 ఏళ్ల రికార్డు బద్దలు, న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం

Big Stories

Advertisement
×