E-Paper
Advertisement

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. తీవ్రత 7.1 గా నమోదు, వందలాది బుల్లెట్ రైళ్లు రద్దు

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. తీవ్రత 7.1 గా నమోదు, వందలాది బుల్లెట్ రైళ్లు రద్దు
Advertisement

Earthquake In Japan: ప్రకృతి కన్నెర చేసింది. తూర్పు దేశాల్లో తరచూ భూకంపాలు జోరు పెరుగుతోంది. తాజాగా జపాన్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. పరిస్థితి గమనించిన జపాన్ వాతావరణ సంస్థ.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ భూకంపం ఎక్కడ వచ్చింది?

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం- మంగళవారం మధ్యాహ్నం జపాన్‌ దక్షిణ ప్రాంతాన్ని భారీ భూకంపం వణికించింది. క్యుషు ద్వీపంలోని కుమమోటో ప్రిఫెక్చర్‌లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చినట్టు అక్కడి అధికారులు తెలిపారు. కుమమోటో సిటీ సమీప ప్రాంత కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదు అయ్యాయి.

Advertisement

తీవ్రత 7.1 గా నమోదు- భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. ఓ భవనం కూలిపోయినట్లు జపాన్ అధికారులు తెలిపారు. చాలామంది గాయాలు పాలైనట్టు తెలిపింది. భూకంపం నేపథ్యంలో కుమమోటో ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

బుల్లెట్ ట్రైన్లు రద్దు- భద్రతా కారణాల దృష్ట్యా బుల్లెట్ రైళ్లతోపాటు అన్ని రైలు సర్వీసులు రద్దు చేసింది. భూకంపం సంభవించిన తర్వాత అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ  పరిస్థితులు తలెత్తలేదని అధికారులు వివరించారు. ఈ ద్వీపంలోని కుమమోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఒయిటా, మియాజాకి వంటి ప్రాంతాలకు అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది జపాన్ ప్రభుత్వం.

Advertisement

వారంలో ఇది రెండో భూకంపం. జూన్ 25న ఉత్తర జపాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జపాన్‌లో ప్రతి ఏడాది వందలాది భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ కూడా ఒకటి.  ఈ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ పశ్చిమ అంచు వెంబడి ఉంది.

ALSO READ: 13 రోజుల బాంబుల వర్షం తర్వాత క్లైమాక్స్… ట్రంప్ నిర్ణయంతో మారిపోయిన సీన్!

ప్రపంచంలోని భూకంపాల్లో దాదాపు 18 శాతం ఇక్కడే సంభవిస్తాయి. అందులో అత్యధికమైనవి, తేలికపాటివి సంభవించే ప్రదేశం, భూమి ఉపరితలం అవి తాకే లోతును బట్టి మారుతూ ఉంటాయి. 2011లో సంభవించిన భూకంపంలో 9.0 తీవ్రత వచ్చింది.  ఆ  ఘటనలో సుమారు 18,500 మంది మరణించారు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైన విషయం తెల్సిందే.

 

Related News

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

Big Stories

Advertisement
×