Jogipet News: పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు సలీమ్. ఆయన చేతికి బేడీలు వేశారు పోలీసులు. ఆయన కోరిక ఒక్కటే. ఒక్క నిమిషం వదిలిపెట్టండి.. ఆత్మహత్య చేసుకుంటానని తెగ వేడుకుంటున్నాడు. ఇంతకీ అతనికి వచ్చిన కష్టమేంటి? పోలీసులు బేడీలు ఎందుకు తొలగించలేదు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం. జోగిపేట పట్టణంలోని తోళ్ల బస్తీకి చెందిన సలీం. ఫ్యామిలీ మధ్య సమస్యల కారణంగా దాదాపు ఆరు మాసాలుగా భార్య కాపురానికి రావడంలేదు. దీంతో మనస్థాపానికి గురైన సలీం, ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్‌స్టేషన్‌లో నిప్పంటించుకుంటానంటూ హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో స్థానిక బంకు వద్ద పెట్రోల్ కొనుగోలు చేశాడు. దాన్ని ఒంటిపై పోసుకొని స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. సలీం వెంట అతడి కాలనీవాసులు పరుగులుపెట్టారు. తన భార్య కాపురానికి రాలేదని అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటానని అరవడం మొదలుపెట్టాడు. పెట్రోల్ బాటిల్ ఒకరు.. అగ్నిపెట్టె మరొకరు లాక్కున్నారు.
సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు, స్థానిక యువకులను పరుగులు పెట్టించాడు. ఎట్టకేలకు అతడి చేతులకు బేడీలు వేశారు. ఎక్కడికీ కదలకుండా ఆసుపత్రిలో ఉంచారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి జోగిపేట సీఐ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆరు నెలల ముందు భార్యకు తలాక్ చెప్పాడు. మరి ఏం జరిగిందో తెలీదు, మళ్లీ ఆమె కావాలని పట్టుబడుతున్నాడు.
ALSO READ: వణుకు పుట్టిస్తున్న హైడ్రా.. రాజేంద్రనగర్ లో అక్రమకట్టడాలు నేలమట్టం
ఆమె రాకపోవడంతో చనిపోతానని, తనను వదిలిపెట్టాలని కోరుతున్నాడు. మద్యం సేవించిన అతడ్ని పోలీసులు జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా పైనుంచి దూకేందుకు ప్రయత్నం చేయబోయాడు. చివరకు బేడీలు వేశాడు. భార్య రాని కారణంగా మద్యానికి అలవాటుపడ్డాడు సలీం.
ఒక్క నిమిషం వదిలిపెట్టండి..
ఆత్మహత్య చేసుకుంటా…పెళ్లాం కాపురానికి రావడంలేదని యువకుడి హల్‌చల్
ఒంటిపై పెట్రోల్ పోసుకొని స్టేషన్‌కు పరుగులు
అడ్డుకున్న పోలీసులుగత ఆరు మాసాలుగా నా భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపంతో జోగిపేట పట్టణంలోని తోళ్ల బస్తీకి చెందిన సలీం అనే యువకుడు… pic.twitter.com/5p2XtlLcrI
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2025