IPL Valuation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League Tournament ) ఉన్న ప్రాధాన్యత అంతా కాదు. 18 సంవత్సరాల కిందట వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్టాండర్డ్ మొత్తం మార్చేసింది. ఈ ఐపీఎల్ టోర్నమెంట్ కారణంగా కుర్ర క్రికెటర్లందరూ వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్ ను బాగా వినియోగించుకొని జాతీయ జట్టులోకి వెళ్తున్నారు. భారతదేశ దేశీయ క్రికెటర్లకు ఐపీఎల్ మంచి ప్లాట్ ఫాం అయిపోయింది. అయితే అలాంటి ఐపీఎల్ టోర్నమెంట్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ విలువ భారీగా తగ్గిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL brand value) విలువ వరుసగా రెండో ఏడాది కూడా పడిపోయినట్లు డి అండ్ పి అడ్వైజరి ఐపిఎల్ – wpl వాల్యుయేషన్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో 93,500 కోట్లు ఉన్న ఐపీఎల్ వ్యాల్యూ 2024 సీజన్ వచ్చేసరికి 82,700 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంటే 2024 సీజన్ దాదాపు రూ. 11 కోట్ల వరకు పడిపోయింది. ఇక 2025లో మరో రూ.6600 కోట్లు తగ్గిపోయింది ఐపీఎల్ టోర్నమెంట్ విలువ. ఈ 2025 సంవత్సరం రూ. 76,500 కోట్లకు ఐపీఎల్ వ్యాల్యూ పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నమెంట్ కు స్పాన్సర్ గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కావడం అలాగే టీవీని డిజిటల్ మీడియా ఓవర్ టేక్ చేయడం కారణంగా ఐపిఎల్ వ్యాల్యూ తగ్గినట్లు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో మినీ వేలం జరగనుంది. ఈ సంవత్సరం డిసెంబర్ మాసంలో ఈ వేలాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15వ తేదీలలో ఈవెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో కాకుండా ముంబై లోనే ఈ వేలం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 15వ తేదీ వరకు రిటెన్షన్ లిస్టును ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఇక ఆటో ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనుంది.
ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మొత్తం 84 మ్యాచులు జరగనున్నాయి. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ పూర్తయిన వెంటనే అంటే మార్చి 15వ తేదీ నుంచి ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 18 సీజన్లు సక్సెస్ఫుల్గా నిర్వహించింది బీసీసీఐ. గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్ లో గెలిచి ఛాంపియన్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజయం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మన ర్యాంక్ ఎంతంటే
IPL valuation falls consecutively for 2 years
IPL valuation drops to ₹76,100 crore in 2025 from ₹82,700 crore in 2024 and ₹92,500 crore in 2023
Women’s Premier League (WPL) valuation falls 5.6% to ₹1,275 crore in 2025 from ₹1,350 crore in 2024 pic.twitter.com/EhXwiluMaK
— BusinessVala (@Businessvala) October 15, 2025