iPhone Inactivity Reboot : కస్టమర్స్ భద్రతే ధ్యేయంగా స్మార్ట్ ఫోన్స్ ను డిజైన్ చేసి లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్.. తాజాగా తీసుకొచ్చిన లేటెస్ట్ మెుబైల్ లో అదిరిపోయే ఫీచర్ ను జోడించింది. ఈ ఫీచర్ వినియోగదారులను సైబర్ ఎటాక్స్ నుంచి కాపాడుతుంది. నేరగాళ్లు ఫోన్ ను యాక్సెస్ చేయకుండా కాపాడగిలిగే ఆ ఫీచర్ ఏంటి.. ఏ మెుబైల్స్ లో ఉంది.. అసలు ఎలా పనిచేస్తుందో ఓసారి చూద్దాం.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తన కస్టమర్స్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను అదిరిపోయే ఫీచర్స్ తో తీసుకొస్తుంది. ఐఫోన్ అంటేనే కస్టమర్స్ భద్రత అన్న రీతిలో మొబైల్స్ ను లాంఛ్ చేసింది. ఇప్పటికే ఐఫోన్స్ లో ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ తాజాగా మరో సరికొత్త ఫ్యూచర్ ను జోడించింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఐఫోన్ 16 లో పాటు మిగిలిన ఐఫోన్స్ లో సైతం పనిచేసేలా బెస్ట్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇనాక్టివిటీ రీబూట్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన టెక్ దిగ్గజం.. ఈ ఫీచర్ ఐఫోన్ను హ్యాకర్స్ యాక్సెస్ చేయకుండా కాపాడుతుంది.
ఇనాక్టివిటీ రీబూట్ ఎలా పనిచేస్తుందంటే –
iOS 18.1 తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ స్మార్ట్ ఫోన్ వాడకంపై ఆధారపడి పనిచేస్తుంది. ఐఫోన్ ను మూడు రోజుల పాటు అన్‌లాక్ చేయబడకపోతే ఆటోమెటిక్ గా రీస్టార్ట్ చేసేస్తుంది. దీంతో ఫోన్ లో ఉండే డేటా దొంగల చేతికి చిక్కకుండా ఉంటుందని ఐఫోన్ యాజమాన్యం తెలిపింది. ఇక ఈ ఫీచర్ పై పలు పరిశోధలు సైతం జరిగాయని.. ఆటోమెటిక్ రీబూట్ అవుతున్నాయని తెలిపాయి. X (గతంలో Twitter)లో పోస్ట్ చేసిన వీడియోలో ఓ వినియోగదారుడు iOS 18.1లో నడుస్తున్న iPhone 14 Pro మోడల్‌ను చూపించాడు. ఈ ఫోన్ ను 72 గంటల పాటు వదిలేస్తే ఆటోమెటిక్ గా రీబూట్ అయిపోయాయి.
ఇక ఐఫోన్‌ను రీబూట్ చేసినప్పుడు, అది ‘ఫస్ట్ అన్‌లాక్‌కు ముందు’ (BFU) పరిస్థితిని అంచనా వేసి పనిచేస్తుంది. ఇక ‘ఆఫ్టర్ ఫస్ట్ అన్‌లాక్’ (AFU)తో పోలిస్తే…. BFU స్థితిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అనధికారికంగా యాక్సెస్ చేయటం చాలా కష్టం. రీబూట్ కాకముందు అయిన తర్వాత సైతం ఫోన్ ఫేస్ తో పాటు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ తో పనిచేస్తుంది. ఇక ఒక ఫోన్ ను మూడు రోజుల పాటు వాడకుండా కస్టమర్ ఉంచే అవకాశం లేదని.. ఇలా సాధారణంగా ఫోన్ పోయినా, దొంగలించిన స్థితిలోనే జరుగుతుందని ఐఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ పై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజులు వాడనంత మాత్రాన డేటా మొత్తం రీబూట్ అయిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. పలు సందర్భాల్లో ఫోన్ ను వదిలి వెళ్ళే అవకాశాలు ఉంటాయని.. అలాంటి సమయంలో డేటా తొలగిపోవడం సమస్యగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఐఫోన్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ దొంగల నుండి ఫోన్స్ లో ఉండే సున్నితమైన డేటాను కాపాడుతుందనే చెప్పాలి.
ALSO READ : తాజాగా లాంఛ్ అయిన మోటోరోలా మెుబైల్ పై ఫ్లిప్కార్ట్ అదిరే ఆఫర్.. రూ.42వేల ఫోన్ పై సగానికి పైగా తగ్గింపు