iQOO 15 Series: 2020లో భారత మార్కెట్లోకి ప్రవేశించి, మొబైల్ గేమింగ్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన iQOO, 2025లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో iQOO 15 సిరీస్, iQOO నియో 11 సిరీస్ లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ రెండు సిరీస్‌లు కూడా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వస్తుండటం విశేషం.
ఈ క్రమంలో iQOO 15, iQOO 15 Pro ముఖ్యంగా డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం విషయంలో పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌లలో 2K రిజల్యూషన్ OLED డిస్ప్లే, ఇది పాత iQOO 13 సిరీస్‌లోని 1.5K ప్యానెల్‌లకు ఒక పెద్ద అప్‌గ్రేడ్. iQOO 15 Proలో Samsung మాదిరిగా 6.85 అంగుళాల LTPO OLED స్క్రీన్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మొబైల్ డిస్ప్లేకు సంబంధించి శక్తివంతమైన అనుభవాన్ని అందించనుంది.
దీనిలో ప్రపంచంలోని అత్యుత్తమ డిస్ప్లే టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా iQOO 15 సిరీస్, కాంతి పరిస్థితులు సహా ఎలాంటి అవరోధం లేకుండా స్పష్టత, రంగుల ప్రామాణికతను అందిస్తాయి. పైగా ఈ ఫోన్‌లు AR (యాంటీ-రిఫ్లెక్టివ్) పూతతో వస్తాయని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది ప్రకాశవంతమైన లైటింగ్ పరిస్థితుల్లో కూడా బెటర్ విజిబిలిటీని అందించడానికి సహాయపడుతుంది.
Read Also: Laptop Offer: మార్కెట్లోకి కొత్త మోడల్.. రూ. 16 వేలకే ల్యాప్‌టాప్ విత్…!
iQOO 15, iQOO నియో 11 సిరీస్‌లలో వచ్చే ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్ 7,000mAh బ్యాటరీ. iQOO 13 సిరీస్‌లో 6,000mAh బ్యాటరీ ఉండగా, ఈ కొత్త పరికరాల్లో దాన్ని అధిగమించి, మరింత శక్తివంతమైన 7,000mAh బ్యాటరీని అందించబోతున్నాయి. ఈ కొత్త బ్యాటరీ వినియోగదారులకు మరింత సమయం పాటు వినియోగాన్ని అందిస్తాయి. iQOO 15 సిరీస్ 7,000mAh బ్యాటరీని అందించడం ద్వారా ఎక్కువ కాలం పాటు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయితే iQOO నియో 11 సిరీస్‌లో కూడా 7,000mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు. ఇది iQOO నియో 10 సిరీస్‌లోని 6,100mAh బ్యాటరీకి పెద్ద అప్‌గ్రేడ్. ఈ సిరీస్‌లో మిడిల్ ఫ్రేమ్ ఉండదని తెలుస్తోంది. ఇది ఫోన్‌ను సులభంగా, తక్కువ బరువుతో రూపొందించడానికి సహాయపడుతుంది. ఇది వినియోగదారులకు ఎక్కువ సౌకర్యాన్ని అందించి, ఫోన్‌ను మరింత ఈజీగా వినియోగించుకునేలా చేస్తుంది.
iQOO 15 Pro మోడల్లో Qualcomm Snapdragon 8 Elite 2 చిప్‌సెట్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ చిప్‌సెట్ పనితీరును పెంచి, మొబైల్ గేమింగ్ లేదా హై ఎండ్ ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది మరింత వేగవంతమైన పర్సనల్ అనుభవాన్ని, స్మూత్ గేమింగ్, ఇతర గ్రాఫికల్ ఇబ్బందులను దగ్గించే విధంగా ఉపయోగపడుతుంది.
ఈ ఫోన్‌లలో పెరిస్కోప్ జూమ్ కెమెరా కూడా ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ఈ కెమెరా పరికరం మంచి జూమ్ సామర్థ్యాన్ని తక్కువ కాంతి పరిస్థితుల్లో ఫోటోగ్రఫీ పనితీరు మెరుగుపరచుకునేలా ఉంటుంది. జూమ్ చేసినప్పుడు కూడా ఇమేజులలో స్పష్టత ఉండటంతో, ఫోటోలు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తాయి. కెమెరా వ్యవస్థలో మరిన్ని ఇన్నోవేటివ్ ఫీచర్లు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.
iQOO 15, iQOO నియో 11 సిరీస్‌లు ఆల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ సాంకేతికత వినియోగదారుల అనుభవాన్ని మరింత వేగవంతమైన సురక్షితమైన అన్‌లాకింగ్ ద్వారా మెరుగుపరచుతుంది.