Dhanush: ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ నడవడం అనేది కామన్. కానీ కొన్ని మనస్పర్థలు అంతటితోనే ఆగిపోతాయి. కొన్ని మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు వెళ్తాయి. ప్రస్తుతం ధనుష్, నయనతార మధ్య జరుగుతుంది అదే. ధనుష్, నయనతార మధ్య చాలాకాలం నుండే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందుకే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించి కూడా చాలా ఏళ్లు అయిపోయింది. ఇప్పుడు నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ అనే డాక్యుమెంటరీ కారణంగా వీరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గురించి బయటపడింది.
మరొక ఆరోపణ
నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్ మొదటిసారి ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే మూవీ సెట్స్‌లో కలిశారు. ఆ సినిమాను విఘ్నేష్ డైరెక్ట్ చేయగా ధనుష్ నిర్మించాడు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఆ మూవీ సెట్‌లోనే నయన్, విఘ్నేష్ ప్రేమలో పడ్డారని ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’లో చూపించారు మేకర్స్. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియోను ఉపయోగించారు. అయితే నిర్మాతగా తన పర్మిషన్ లేకుండా ఆ వీడియోను ఉపయోగించారంటూ ధనుష్ కేసు ఫైల్ చేశాడు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో నడుస్తుండగానే నయన్, విఘ్నేష్‌కు మరొక షాక్ ఇచ్చాడు ధనుష్.
ఎక్స్‌ట్రా డ్యామేజ్
ముందుగా ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ విషయంలో నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) నుండి రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కేసు ఫైల్ చేశాడు ధనుష్. ఆ కేసు హియరింగ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ విషయంలోనే రూ.1 కోట్ల డ్యామేజెస్ కోరుతూ మరొక కేసు ఫైల్ చేశాడు. దానికి మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రవర్తనే కారణం అని చెప్పాడు. వాళ్లిద్దరూ షూటింగ్ సమయంలో అస్సలు ప్రొఫెషనల్‌గా లేరని ఆరోపించాడు. విఘ్నేష్.. తరచుగా నయనతార యాక్ట్ చేయాల్సిన సీన్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడని, ఇతర క్యాస్టింగ్ షూటింగ్ గురించి పెద్దగా పట్టించుకునేవాడని కాదని అన్నాడు ధనుష్.
Also Read: రన్యా స్మగ్లింగ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది అతనే.?
తరువాతి హియరింగ్
ఇప్పటికే ధనుష్ (Dhanush), నయనతార (Nayanthara) మధ్య జరుగుతున్న ఈ లీగల్ యుద్ధం ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన తరువాతి హియరింగ్ 2025 ఏప్రిల్ 9కి వాయిదా పడింది. అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయం ప్రేక్షకులకు కూడా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఒక చిన్న సీన్‌ను ఉపయోగించుకున్నందుకు ధనుష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటూ నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. తనకు లైఫ్ ఇచ్చిన హీరో అయిన ధనుష్‌కు గౌరవం ఇవ్వకుండా నయన్ ప్రవర్తిస్తుందని హీరో ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఈ గొడవ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.