Pakistan Train Hijacked : పాకిస్థాన్ లోని బలూచ్ వేర్పాటు వాదులు… తమ భూభాగంలోని ఓ ట్రైన్ ను హైజాక్ చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని వేర్పాటువాద సాయధులు ఫిబ్రవరి 11న మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులున్న ప్యాసింజర్ రైలుపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. లోకో ఫైలట్ ను గాయపరిచిన సాయుధులు.. రైలును పూర్తిగా వారి అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా.. ఆరుగులు సైనిక సిబ్బంది మృత్యువత పడగా.. సాయుధులైన బలూచ్ ఉగ్రవాదుల చేతిలో దాదాపు 100 మందికి పైగా ప్రయాణికులు బంధీలుగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
పాకిస్తాన్‌లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను లక్ష్యంగా చేసుకున్న బలూచ్ ఆర్మీ.. ట్రైన్ పై కాల్పులకు పాల్పడినట్లు పాకిస్థాన్ రైల్వే వెల్లడించింది. ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్న ఉగ్రవాద వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. చాన్నాళ్లుగా ఈ ప్రాంతంలో పాక్ అధికారులు, సైన్యంపై విరుచుకుపడుతోంది. వీలు చిక్కినప్పుడల్లా దాడులు చేస్తూ.. భీభత్సం చేస్తోంది.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న రైలులో పాక్ సైన్యానికి చెందిన సిబ్బంది, ఇతర భద్రతా సంస్థల సభ్యులున్నారు అనేది బలూచ్ ఆర్మీ అనుమానం. వారు స్వతహాగా తనకు లొంగిపోవాలని డిమాండ్ చేసిన బలూచ్ సైనికులు.. లేదంటే అందరి ప్రాణాలకు ముప్పే అంటూ హెచ్చరికలు చేసింది.
బలూచ్ ఆర్మీ నుంచి అనూహ్య దాడులతో పాక్ ప్రభుత్వం, సైన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం బంధీలుగా ఉన్న వారిలో పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ATF), ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) విభాగాలకు చెందిన యాక్టివ్-డ్యూటీ సిబ్బంది ఉన్నారని బలూచ్ ఆర్మీ ప్రకటించింది. వీరందరూ సెలవుపై పంజాబ్‌కు ప్రయాణిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రైలులో ఉన్న వారిలో మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రయాణికులను విడుదల చేశామని ప్రకటించిన సాయుధ బలూచ్ ఆర్మీ.. మిగిలిన బందీలందరూ పాకిస్తాన్ దళాలకు సేవ చేస్తున్నారని నిర్ధారించుకున్నట్లు వెల్లడించింది.
కొన్ని విషయాల్లో బలూచ్ ఆర్మీ చాలా క్రూరంగా పని చేస్తోంది. ముఖ్యంగా పాక్ విషయంలో మరింత ఆగ్రహంగా దాడులకు తెగబడుతోంది. ఈ తరుణంలో.. రైలులోని వారి గుర్తింపులు పరిశీలిస్తూ.. ఇప్పటికే 6 గురిని కాల్చి చంపిన బలూచ్ సైనికులు.. మిగతా వారిని ఏం చేయనున్నారో అన్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉన్న నేపథ్యంలో.. ఇంకా బలూచ్ అధికారులు కానీ, రైల్వే నుంచి కానీ ఎలాంటి ప్రాణ నష్టంకు సంబంధించిన సమాచారం వెల్లడి కాలేదు. అలాగే.. బందీల స్థితిగతులపైనా వివరాలు తెలియడం లేదని.. ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి.
అయితే.. ప్రస్తుతం రైలును స్వాధీనం చేసుకున్న ప్రాంతానికి భద్రతా దళాలు చేరుకున్నాయని తెలిపిన పాక్ ప్రభుత్వం.. అక్కడ అత్యవసర చర్యలు విధించిందని తెలిపింది. బలూచ్ సైన్యం నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు, అక్కడి పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని సంస్థలను సమీకరించామని ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ మీడియాకు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి మరిన్ని భద్రతా దళాలు చేరుకున్నాయని పాక్ రైల్వే ప్రకటించింది.
Also Read : Lalit Modi Vanuatu Passport: ఆర్థిక నేరగాడు లలిత్ మోదీకి ఆ దేశం షాక్.. నేరస్తుడని పౌరసత్వం రద్దు!
పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోరుతుంది. తమ ప్రాంతంలోని వనరుల దోపిడిపై తీవ్ర నిరసన తెలుపుతున్న బెలూచ్ ప్రజలు.. పాకిస్తాన్, చైనా సైనికులు, భద్రతా దళాలపై దాడుల్ని తీవ్రతరం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని బెలూచ్ ఆర్మీ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడులు చోటుచేసుకున్నాయి.