BigTV English

Laptop Offer: మార్కెట్లోకి కొత్త మోడల్.. రూ. 16 వేలకే ల్యాప్‌టాప్ విత్…!

Laptop Offer: మార్కెట్లోకి కొత్త మోడల్.. రూ. 16 వేలకే ల్యాప్‌టాప్ విత్…!

Laptop Offer: ప్రస్తుత ప్రపంచంలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‎ఫోన్లు సాధారణ వస్తువులుగా మారిపోయాయి. అనేక స్కూళ్లల్లో మ్యాక్ బుక్ లేదా ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు చదువు చెప్పేందుకు, వాటిలోనే హోం వర్క్ చేసేందుకు వినియోగిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులతోపాటు మహిళలు కూడా వీటి ద్వారా అనేక రకాల ఆఫీస్ పనులను నిర్వహించుకుంటున్నారు. దీంతో నిత్య జీవితంలో వీటికి క్రమంగా డిమాండ్ ఏర్పడింది. అయితే తాజాగా ల్యాప్‌టాప్‌ విత్ నోట్ బుక్ ఫీచర్లు ఉన్న కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త మోడల్ పేరు Chuwi HeroBook Pro 14.1. ఇది తక్కువ ధరలో ఒక ప్రీమియం ల్యాప్‌టాప్ విధంగా బెస్ట్ ఫీచర్లతో లభిస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.


ప్రాసెసర్

Chuwi HeroBook Pro ల్యాప్‌టాప్‌లో Intel Celeron N4020 ప్రాసెసర్ ద్వారా వస్తుంది. ఇది తక్కువ పవర్ కన్జంప్షన్‌తో కూడిన ప్రాసెసర్. కానీ మంచి పనితీరును అందిస్తుంది. 1.1GHz నుంచి 2.8GHz వరకూ మెగాహర్ట్జ్ స్పీడ్‌తో ఇది ప్రాసెసింగ్ పనులను సులభంగా నిర్వహిస్తుంది. ఇది ప్రధానంగా డైలీ టాస్కుల కోసం, విద్యార్థుల కోసం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

RAM (8GB)

ఈ ల్యాప్‌టాప్ 8GB RAMతో అందుబాటులో ఉంది. ఇది బహుళ అప్లికేషన్లు, బ్రౌజర్ టాబ్‌లు, ప్రొడక్టివిటీ టూల్స్‌ని ఈజీగా మ్యానేజ్ చేస్తుంది.


స్టోరేజ్ (256GB SSD)

Chuwi HeroBook Pro 14.1 ల్యాప్‌టాప్‌లో 256GB SSD ఉంటుంది. SSD స్టోరేజ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ (HDD)తో పోలిస్తే చాలా వేగంగా పని చేస్తుంది. దీంతో దీనిలోని అప్లికేషన్లు తక్కువ సమయంలో ఓపెన్ అవుతాయి. డేటా యాక్సెస్ వేగంగా ఉంటుంది.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం

ఈ ల్యాప్‌టాప్ Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ మరింత ఆకర్షణీయంగా, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో మీకు కొత్త టాస్క్ బార్, మెరుగైన అప్లికేషన్ ఇంటిగ్రేషన్, మరిన్ని ఫీచర్లు ఉంటాయి.

Read Also: HD TV offer: సగానికిపైగా తగ్గింపు..రూ. 7 వేలకే బ్రాండెడ్ HD టీవీ..

1TB Expandable Storage

Chuwi HeroBook Pro 14.1 ల్యాప్‌టాప్‌లో 1TB expandable storage ఉంటుంది. అంటే మీరు ల్యాప్‌టాప్ లోని స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీరు 1TB వరకు అదనపు స్టోరేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మరిన్ని ఫైల్స్, డేటా లేదా మీడియా ఫైల్‌లను ఈజీగా స్టోర్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది.

14.1-inch Full HD IPS Display

ఈ ల్యాప్‌టాప్‌లో 14.1-inch Full HD IPS display ఉంది. ఇది 1920×1080 pixels రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది కంటికి మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. IPS ప్యానెల్, FHD రిజల్యూషన్తో మీరు దీనిని మరింత స్పష్టతతో చూడవచ్చు.

Ultra-Slim Design

Chuwi HeroBook Pro 14.1 ల్యాప్‌టాప్‌లో ultra-slim design ఉంది. ఇది ఒక స్లిమ్, లైట్ వెయిట్ ల్యాప్‌టాప్‌గా లభిస్తుంది. ఇది పోర్టబుల్ సౌకర్యాలతోపాటు ప్రయాణాలు చేసే వారికి సౌకర్యంగా ఉంటుంది.

USB 3.0 & Mini-HDMI Ports

ఈ ల్యాప్‌టాప్‌లో USB 3.0, Mini-HDMI పోర్టులు ఉంటాయి. USB 3.0 పోర్ట్‌ను ఉపయోగించి మీరు వేగంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అలాగే Mini-HDMI పోర్ట్‌తో మీరు మానిటర్లను, టీవీలను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. Chuwi HeroBook Pro 14.1 ల్యాప్‌టాప్ ధర ప్రస్తుతం అమోజాన్లో రూ. 16,990గా ఉంది.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×