iQOO Neo 10, Neo 10 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తాజాగా రెండు మొబైల్స్ ను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐక్యూ నియో 10 సిరీస్ పేరుతో రాబోతున్న ఈ మొబైల్స్ అత్యాధునిక ఫీచర్స్ తో మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇక ఈ మెుబైల్ రిలీజ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెబుతూ ఐక్యూ తాజాగా లాంఛ్ డేట్ ను ప్రకటించింది.
ఐక్యూ తాజాగా తీసుకొస్తున్న నియో 10 సిరీస్ మెుబైల్స్ నవంబర్ 29న లంఛ్ కాబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఇక ఈ మొబైల్స్ లో హై క్వాలిటీ డిస్ ప్లేతో పాటు ప్రాసెసర్, కెమెరా క్వాలిటీ సైతం అత్యద్భుతంగా ఉన్నాయి. Weiboలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించింది.
ఐక్యూ నుంచి నియో 10, నియో 10 ప్రో మెుబైల్స్ రాబోతున్నాయి. ఇందులో Neo 10 Pro మెుబైల్ MediaTek Dimensity 9400 ప్రాసెసర్, 6.78 అంగుళాల డిస్ ప్లేతో రాబోతుంది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP కెమెరాతో పాటు 120W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ ఉంది. iQOO Neo 10 Proలో ఉండే MediaTek డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. iQOO 13లో ఉన్నట్లే ఇందులో చిప్‌సెట్ 144FPS గేమింగ్, 2K సూపర్ రిజల్యూషన్‌ను అందిస్తుంది.
iQOO నియో 10 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 6.78 అంగుళాల 1.5K 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. గరిష్టంగా 16GB RAM, 512GB స్టోరేజీకి మద్దతు ఇస్తుంది. నియో 10 ప్రో 50MP ప్రైమరీ కెమెరాతో 50MP సెకండరీ కెమెరాతో రాబోతుంది. బహుశా అల్ట్రా వైడ్ లెన్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక నియో 10 ప్రో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీతో వచ్చేస్తుంది. ఆప్టికల్ సెన్సార్‌తో పోలిస్తే ఈ మెుబైల్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైతం ఉండనుంది.
iQOO Neo 10 సిరీస్ ధర ప్రస్తుతానికి తెలియనప్పటికీ… iQOO ఇప్పటికే తీసుకొచ్చిన మోడల్స్ కంటే ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చైనాలో లాంఛ్ అయిన ఈ మెుబైల్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు భారత్ లో సైతం లాంఛ్ కు సిద్ధమైంది.
ALSO READ : ఇప్పటివరకూ వచ్చిన వాటిలో తోపు మెుబైల్ ఇదే.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!