Man Died While Doing Reels: రీల్స్ పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడపడితే అక్కడే రీల్స్ చేస్తుంటారు. లైకుల కోసం, షేర్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొంతమంది రైల్వే ట్రాకుల మీద రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే మరికొందరు ఎత్తైన ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇక మరికొంతమంది అయితే నీళ్లలో దూకి స్టంట్స్ చేస్తుంటారు. అలానే ఓ యువకుడు రీల్స్ పిచ్చితో నీటిలో దూకి ప్రాణం తీసుకున్నాడు. ఈత వస్తే నీటిలో దూకచ్చు రీల్స్ చేయొచ్చు.
కానీ కనీసం ఈత కూడా రాకుండా నీళ్లలో దూకడం ఆశ్చర్యకరం. పరిగెత్తుకుంటూ వచ్చిన యువకుడు కాలువలో దూకేశాడు. కానీ ఆ కాలువలో నుండి తిరిగి పైకి రాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీటిలో దూకిన యువకుడి కోరిక కూడా వీడియో వైరల్ అవ్వడమే. వీడియో అయితే వైరల్ అయింది కానీ ఆ లైకులు, షేర్లు చూసుకునేందుకు యువకుడు లేకుండా పోయాడు.
నీటిలో దూకి తిరిగి లేవకపోవడంతో స్నేహితులు వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఈత రానిదే అందులో ఎందుకు దూకావు రా అంటూ ఓ నెటిజన్లు కామెంట్ పెడితే మరో నెటిజన్ బ్రో అనుకున్నదే జరిగింది. బాగా వైరల్ అయ్యాడు..కానీ సక్సెస్ చూసుకోలేకపోయాడు అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. సోషల్ మీడియా పిచ్చితో కేవలం ప్రాణాలు పోవడమే కాదు.. పరువు పోవడం, సంసారాలు నాశనం అవ్వడం లాంటి ఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.