Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయాత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తమ భూమి పట్టాకు సంబంధించి ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని నకిలీ పట్టాలు సృష్టించి కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ‘‘సీఐ, ఎస్ఐల దగ్గరకు పోయినం.. ఎమ్మార్వోను కలిసినం.. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాళ్లోకి వెళ్తే.. 70 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి ఎనిమిది ఏకరాల భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టాలు సృష్టించి తమ నుంచి లాక్కున్నారు అని సదరు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువారం మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందినటువంటి ఓ కుటుంబం ఇటు 70 ఏళ్లుగా ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిని ఇటు సాగు చేసుకుంటుంది. అయితే ఇటివల కాలం లోపల వాళ్ళు ఇటు బయటకు విదేశాలకు వెళ్లి వచ్చేంత లోపల 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి ఎనిమిది ఎకరాల భూమి ఉందో ఆ దానిని కొంతమంది ఇటు రెవెన్యూ అధికారుల అండతో సహాయంతో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆ పట్టాలు సృష్టించారు అని వారు చెబుతున్నారు.
Read Also: Supreme Court: రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు లో విచారణ.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
అయితే తమకు న్యాయం జరగాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన గాని తమకు న్యాయం జరగడం లేదని, ఈరోజు ఆ కుటుంబ సభ్యులంతా కలిసి కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. అయితే ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ కుటుంబం తమకు న్యాయం కావాలి అని చెప్పి అయితే తమ వెంట తీసుకొచ్చినటువంటి ఆ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారి దగ్గర నుంచి పురుగుల మందు డబ్బాలు లాక్కోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
దీనిపై స్పందించిన కలెక్టరేట్ అధికారులు బాధితులకు అండగా నిలుస్తామన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రెవిన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది.