Big Stories

iQOO New Smartphones : ఫోన్ల జాతర.. ఒకేసారి మూడు మోడళ్లు లాంచ్

iQOO New Smartphones : చైనీస్ టెక్ కంపెనీ iQOO స్టైలిష్ లుక్‌తో స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. కంపెనీ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. iQOO మొబైల్స్‌కు గ్లోబల్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో కంపెనీ iQOO నుంచి మూడు సిరీస్‌లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. iQOO ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్లను తీసుకురానుంది. ఇందులో iQOO Z9, Z9x, Z9 Turbo వేరియంట్లు ఉన్నాయి.  ఈ ఫోన్ ధరలు, ఫీచర్లు తదితర విషయాలు తెలుసుకోండి.

- Advertisement -

iQOO Z9 మార్చిలో 3C అథారిటీ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసింది. అలానే  Vivo V2352A ఫోన్ చైనా మార్కెట్‌లో iQOO Z9 Turboగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌తో వస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్‌లో 6000mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకమైన చిప్ ఫోన్లో ఉంటుంది. ఫోన్ హీట్ కంట్రోల్ చేయడానికి 6K VC కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.

- Advertisement -

Also Read : వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు మామ

ఫోన్ 16 GB RAMతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఫోన్  3C సర్టిఫికేషన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని వెల్లడించింది.  iQOO Z9 Turbo 16GB RAM + 256GB, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది.

iQOO Z9 ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింజ్ సపోర్ట్‌తో వస్తుంది. iQOO Z9 12GB RAM + 256GB, 12GB RAM + 512GB రెండు స్టోరేజ్ వేరియంట్‌లో వస్తోంది.

Also Read : నాలుగు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!

iQOO Z9x Snapdragon 6 Gen 1 SoC ప్రాసెసర్‌పై వస్తోంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. Z9x 8GB RAM + 256GB, 12GB RAM + 256GB వంటి రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో మార్కెట్‌లోకి వస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News