BigTV English

Sayaji Shinde Admitted in Hospital: ఛాతీ నొప్పితో ఆస్పత్రి పాలైన టాలీవుడ్ నటుడు.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Sayaji Shinde Admitted in Hospital: ఛాతీ నొప్పితో ఆస్పత్రి పాలైన టాలీవుడ్ నటుడు.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Sayaji Shinde Admitted in Hospital due to Chest Pain: ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఛాతినొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్యులు అతనికి యాంజియోప్లాస్టీ చేశారు. అయితే ఇప్పుడు సాయాజీ షిండే ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.


మహారాష్ట్ర సతారాలోని ప్రతిభా ఆసుపత్రిలో సాయాజీ షిండే చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. సాయాజీ షిండే గతకొద్ది రోజుల నుంచి ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అతడు ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు కొన్ని టెస్ట్‌లు జరిగాయి. గుండెలో వెయిన్ బ్లాక్ ఉందని అర్థమైంది.

హృదయంలో కుడివైపు సిరలు మూసుకుపోయాయి. వెంటనే యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించాం. షూటింగ్‌‌ క్యాన్సిల్ చేసుకొని ఆయన చికిత్స‌కు రెడీ అయ్యారు. సతారాయత్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ముందుగానే జాగ్రత్తపడటంతో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్ అన్నారు.


Also Read: బ్యాట్‌తో కార్తికేయ పరుగులు.. కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రివీల్

అయితే అతడి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని.. మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా కొన్ని రోజులుగా సాయాజీ షిండే అస్వస్థతతో ఉన్నారని డాక్టర్ తెలిపారు. సాయాజి షిండే సినిమాల విషయానికొస్తే.. ఆయన తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించాడు.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి వంటి భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో విలన్ క్యారెక్టర్లు చేసి సినీ ప్రియుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ నటించిన అనుభవం అతనికి ఉంది.

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఆసుపత్రి పాలవడంతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. త్వరలో ఆయన కోలుకుని మళ్లీ సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×