BigTV English
Advertisement

ISRO Gaganyan : గగన్ యాన్ .. మిషన్ టెస్ట్ లాంచ్ విజయవంతం..

ISRO Gaganyan : గగన్ యాన్ .. మిషన్ టెస్ట్ లాంచ్ విజయవంతం..
Gaganyaan mission launch live today

Gaganyaan mission launch live today(Telugu news live):

అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు భారత్‌ చేపడుతున్న గగన్‌యాన్‌ మిషన్ టెస్ట్ లాంచ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. శ్రీహరికోట నుంచి TV-DV1 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిగింది. సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత.. పారాచూట్ సాయంతో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో పడిపోయింది.


అంతకుముందు.. ఇంజిన్‌ ఇగ్నిషన్ సరైన సమయానికి జరగకపోవడంతో టెస్ట్‌ లాంచ్ వాయిదా పడింది. కౌంట్ డౌన్‌కి 4 సెకండ్ల ముందు సాంకేతిక లోపాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత లాంఛింగ్‌లో తలెత్తిన లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించి సరిచేసినట్టు ఇస్రోట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

గగన్‌యాన్‌లో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ టెస్ట్ డ్రైవ్ వాయిదాలు పడుతూ వచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రయోగం జరగాల్సి ఉంది. అయితే, మొదట సాంకేతిక కారణాల వలన 30 నిమిషాలు పాటు వాయిదా పడింది. తర్వాత మరోసారి 15 నిమిషాలు వాయిదా పడింది.


2025లో జరగనున్న గగన్ యాన్ ప్రయోగం కోసం సుమారు 20 టెస్ట్ డ్రైవ్ లు జరగనున్నాయి. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ టెస్ట్ డ్రైవ్ కీలకంగా ఇస్రో భావిస్తోంది. అంటే.. నింగిలోకి దూసుకెల్లిన తర్వాత.. వ్యోమగాములు ప్రమాదంలో ఉంటే వారిని సేఫ్ గా కిందకు తీసుకొచ్చేందుకు ఈ టెస్ట్ డ్రైవ్ జరగనుంది. అయితే.. ఈ టెస్ట్ డ్రైవ్ మానవరహితంగా జరగనుంది.

అస్ట్రోనాట్స్‌ ప్రయాణించే క్రూ మాడ్యుల్‌, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఆ తర్వాత క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది.

ఆ తర్వాత ఇండియన్‌ నేవీ సాయంతో క్రూ మాడ్యుల్‌ను ఇస్రో తిరిగి స్వాధీనం చేసుకోనుంది. అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషించనున్నారు సైంటిస్టులు. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్‌ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది.

క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం సిస్టం భూమికి 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి _ప్యారాచూట్ల సహాయంతో తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాలు చేసేందుకు రూట్‌ క్లియర్‌ అయినట్టే అని ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించారు. గగన్ యాన్ లో కీలకమైనది క్రూ మాడ్యూల్.. అస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకో వెళ్ళేది, తిరిగి భూమిమీదకు వచ్చేది ఈ క్రూ మాడ్యూల్ నుంచే. కేరళ నుంచి క్రూ మాడ్యూల్ ను ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చిన ప్రయోగానికి రెడీ చేశారు.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×