BigTV English

Bhagavanth Kesari updates : థియేటర్లలో బాలయ్య జోరు.. భగవంత్ కేసరి కలెక్షన్ల రికార్డు..

Bhagavanth Kesari updates : థియేటర్లలో బాలయ్య జోరు.. భగవంత్ కేసరి కలెక్షన్ల రికార్డు..
bhagavanth kesari updates

Bhagavanth Kesari updates : ఆరు పదుల వయసులో ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ లాంటి వరస హీట్ లతో దూసుకుపోతున్నాడు బాలయ్య. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ దసరాకు హ్యాట్రిక్ విజయం సాధించి మాంచి ఊపు మీద ఉన్నాడు. లియో, టైగర్ నాగేశ్వరరావు మూవీలలో తలపడిన బాలయ్య చిత్రం థియేటర్లలో తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. మిగిలిన రెండు చిత్రాలతో పోల్చుకుంటే బాలయ్య జోరుగా దూసుకు వెళ్తున్నాడు. 


‘భగవంత్ కేసరి’ మొదటి రోజు నుంచే తీవ్రమైన పోటీని తట్టుకుంటూ తనదైన శైలిలో రికార్డులు బద్దలు కొడుతుంది. భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టి తన సత్తా చాటడమే కాకుండా రెండో రోజు కూడా రికార్డు లెవెల్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. మొదటి రోజు లియో తోటే పోటీ పడిన భగవంత్ కేసరి రెండో రోజు టైగర్ నాగేశ్వరరావు తో కూడా ఢీ అంటే ఢీ అంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో తెలుసా?

ఈసారి బాలకృష్ణ తన వయసుకు తగిన పాత్ర చేయడమే కాకుండా అద్భుతమైన డైలాగ్స్ తో థియేటర్లో దంచి కొట్టాడు. శ్రీలీల , కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసింది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కించిన ఈ మూవీలో విలన్‌‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌‌గా నటించాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీ ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై నిర్మించారు.


రెండో రోజు అమెరికా లో రికార్డ్ స్థాయి లో వసూలు రాబట్టింది. 5.8 కోట్లు షేర్లు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 18 కోట్ల వరకు ఈ చిత్రం షేర్స్ సాధించింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఆంధ్రాలో 8.7 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, నైజాంలో 4.9 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా 20 కోట్ల షేర్లు సాధించడమే కాకుండా 24 కోట్ల గ్రాస్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఓవర్సీస్ లో 8.15 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

బాలయ్యను యాక్షన్ సీన్స్ చూపించడంలో బోయపాటికి ఏమాత్రం తీసిపోను అని అనిల్ రావిపూడి ఈ మూవీ ద్వారా నిరూపించుకున్నాడు. కేవలం కామెడీ చిత్రాలు మాత్రమే తీస్తాడు ,యాక్షన్ పెద్ద అనుభవం లేదు అన్న విమర్శకుల చేతే ప్రశంసల వర్షం కురిపించుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీతో బాలయ్యకు హ్యాట్రిక్ కొట్టాడని నందమూరి అభిమానులు ఖుష్ అవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×