ISRO 100th Mission: GSLV f-15 ప్రయోగం సక్సెస్ అయింది. NVS-02 శాటిలైట్ ను రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. నావిక్ రెండో సిరీస్‌కి సంబంధించిన ఈ శాటిలైట్ మ్యాప్‌లకు బాగా ఉపయోగపడుతుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. 2 వేల 250 కేజీల బరువు ఉన్న శాటిలైట్.. ఇకపై జీపీఎస్ సేవల్ని అందించనుంది.
స్వదేశీ క్రయోజెనిక్ స్టేజ్‌తో కూడిన GSLV-F15 రాకెట్‌తో NVS-02 మిషన్‌తో ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో మరో రికార్డు క్రియేట్ చేసింది. NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సైంటిస్ట్‌లు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. 36 వేల 577 కిలోమీటర్ల దూరం ఎత్తున ఉన్న జియో స్టేషనరీ కక్ష లోకి దీన్ని పంపుతున్నారు. ఈ ఉపగ్రహం దేశంలోని విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఈ రాకెట్ ద్వారా శాటిలైట్ ప్రయోగంతో ఈ సెంచరీ స్పెషల్‌గా నిలిచింది. ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకోనుంది ఇస్రో. 1980లో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది. జనవరి 29న వందో రాకెట్ 6-23 గంటలకు నింగిలోకి GSLV F-15 దూసుకెళ్ళింది. ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. పదేళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందించనుంది. GSLV F-15 రాకెట్‌తో NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని.. జియో ట్రాన్స్‌మిషన్ ఆర్బిట్‌లోకి పంపనుంది. దీనికోసం శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదిలా ఉంటే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి. ఆరు దశాబ్ధాలకు పైగా ప్రయాణం చేసిన భారత అంతరిక్ష పరిశోధనలు.. ప్రయోగాల దశకు చేరుకోడానికి పడిన పునాదుల నుండీ… వందో రాకెట్ పంపే వరకూ చాలా వైఫల్యాలను చవిచూసింది. ముఖ్యంగా, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్ల్లో ఎదుర్కున్న సవాళ్ల నుండి పాఠాలు నేర్చుకొని.. ఇప్పుడు సొంత ఉపగ్రహాలను, కచ్చితమైన లక్ష్యానికి పంపేంతగా ఇస్రో మెరుగయ్యింది. విఫలాల లిస్ట్ ఎంత ఉన్నా ప్రపంచ దేశాలు నివ్వెరపోయాలా పొందిన విజయాలు ఇస్రోకే సాధ్యమయ్యాయి.
Also Read: చాట్ జీపీటీపై గ్లోబల్ పబ్లిషర్స్ దావా.. కంటెంట్ కాపీపై చేస్తుందంటూ ఆరోపణ
2010 లో ప్రయోగించిన రెండు GSLV వాహనాలు.. ఉపగ్రహాన్ని గమ్యం చేర్చడంలో విఫలమయ్యాయి. అయితే, దేశీయంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను ఉపయోగించిన GSLV Mark-II GSLV-D5 ఉపగ్రహ వాహక ప్రయోగం మొదటిసారి విజయవంతం అయ్యింది. దీన్ని 2014 జనవరి 5న ప్రయోగించారు. ఇక, జీఎస్ఎల్‌వి శ్రేణి ఉపగ్రహ ప్రయోగ వాహనాలన్నీ ఆంధ్రప్రదేశ్, నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుండి ప్రయోగించడం విశేషం. ఇప్పుడు, రాబోయే ప్రయోగాలకు కూడా ఇదే వేదిక అయ్యింది
గగన్‌యాన్ మూడో దశలో భాగంగా, GSLV Mk IIIలో ఇస్రో, సిబ్బందితో కూడిన ఆర్బిటర్ గగన్‌యాన్‌ను ప్రయోగించాలని ప్రణాళిక చేసింది. 1960లలో భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలనున ప్రారంభించినప్పుడు, దేశం పరిమిత వనరులతో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. కానీ, రాను రానూ భారత్ అంతరిక్ష కార్యక్రమాల్లో తన సత్తాను చూపించింది. ఇప్పుడు, అంతర్జాతీయంగా ఇస్రో అతిపెద్ద స్టాప్‌గా నిలిచింది. ఈ ప్రయాణంలో ఇప్పుడు సెంచరీ పూర్తి చేస్తున్న ఇస్రో… భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు మరింత వేగంగా చేస్తుందనడంలో సందేహం లేదు.