One Day Trips From Delhi: దేశ రాజధాని ఢిల్లీ పరిసన ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తాజ్ మహల్ మొదలుకొని, రిషికేష్, జైపూర్ కోట, పర్వానూ పర్వత విన్యాసాలు సహా ఎన్నో కనువిందు చేసే టూరిస్టు స్పాట్లు ఉన్నాయి. ఒకే రోజులో ఢిల్లీ నుంచి వెళ్లొచ్చే పలు పర్యాటక ప్రాంతాలను ఇప్పుడు చూద్దాం..
⦿ ఆగ్రా
ఢిల్లీ నుంచి ఒక్క రోజులో వెళ్లి వచ్చే బెస్ట్ టూరిస్టు స్పాట్ ఆగ్రా. ఢిల్లీ నుంచి కేవలం 239 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రేమకు చిహ్నంగా భావించే పాలరాతి ఐకానిక్ తాజ్ మహల్ ను చూసి మైమరచి పోవచ్చు. అద్భుతమైన నిర్మాణ శైలి, గొప్ప చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆగ్ర కోటను కూడా చూడవచ్చు. ఆగ్రా సందర్శన మొఘల్ సామ్రాజ్యంలోని మరుపురాని అనుభూతులను అందిస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి సమయంలో వెళ్తే ఇంకా బాగుంటుంది.
⦿ జైపూర్
ఢిల్లీ నుంచి ఒక్క రోజులో వెళ్లి వచ్చే ప్రదేశాల్లో జైపూర్ ఒకటి. దేశ రాజధాని నుంచి 310 కిలో మీటర్ల దూరం ఉంటుంది. పింక్ సిటీగా పిలువబడే జైపూర్ లో ఎటు చూసిన రాజరికపు చిహ్నాలే కనిపిస్తాయి. అద్భుతమైన అంబర్ కోట, సిటీ ప్యాలెస్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. జైపూర్ ఓల్ట్ సిటీలోని మార్కెట్ల ఆకట్టుకుంటాయి. జైపూర్ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయ చేతిపనులు అందరినీ ఆకట్టుకుంటాయి.
⦿ రిషికేష్
ఢిలీ నుంచి 226 కిలో మీటర్ల దూరంలో రిషికేష్ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉంటుంది. ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. హిమాలయాల పర్వత ప్రాంతంలో ఉన్న రిషికేష్ పర్యాటకులకు ఎంతగానో ఆహ్లాదాన్ని పంచుతుంది. ప్రపంచ యోగా రాజధానిగా పిలువబడే రిషికేష్.. అత్యంత ప్రశాంతతను కలిగిస్తుంది. పవిత్ర దేవాలయాలు, గంగా హారతిని వీక్షించే అవకాశం ఉంటుంది.
⦿ నీమ్రానా కోట
ఇక రాజస్థాన్ లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో నీమ్రానా కోట ఒకటి. ఢిల్లీ నుంచి కేవలం 126 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆరావళి కొండలలో ఉన్న ఈ కోట గత పాలన గుర్తులకు సాక్ష్యంగా నిలుస్తుంది. 15వ శతాబ్దపు కోట ఉత్కంఠభరితమైన దృశ్యాలు, సొగసైన వాస్తుశిల్పం అబ్బుర పరుస్తుంది.
⦿ భరత్ పూర్ పక్షుల అభయారణ్యం
ప్రకృతి ప్రేమికులకు ఎంతో నచ్చే ప్రాంతం భరత్ పూర్ పక్షుల అభయారణ్యం. కియోలాడియో నేషనల్ పార్క్ గా పిలుస్తారు. ఇక్కడి 360 కంటే ఎక్కువ పక్షి జాతులు ఉంటాయి. పక్షుల కిలకిల రావాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఢిల్లీ నుంచి కేవలం 186 కిలో మీటర్ల దూరం లో ఉంటుంది.ఈ పార్కులో కాలినడకన, లేదంటే సైకిల్ ద్వారా, గైడెడ్ రిక్షాల్లో పర్యటించే అవకాశం ఉంటుంది.
⦿ సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఉంది సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం. ఢిల్లీ నుంచి ఒక్క రోజులో వెళ్లి రావాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇందులో బెంగాల్ టైగర్లు, చిరుతలు, వివిధ పక్షి జాతులతో సహా పలు రకాలు వృక్షాలు, పక్షలు, జంతువులు ఆకట్టుకుంటాయి. ఈ అభయారణ్యంలో థ్రిల్లింగ్ జీప్ సఫారీలు ఆకట్టుకుంటాయి. అభయారణ్యంలోని దట్టమైన అడవులు, పురాతన దేవాలయాలు, చారిత్రక సంపద ఆకట్టుకుంటుంది. ఢిల్లీ నుంచి కేవలం 225 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
⦿ దామ్ దామ సరస్సు
హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఉన్న దామ్ దామ సరస్సు ప్రశాంతమైన, సుందరమైన విహార ప్రదేశం. ఢిల్లీ నుంచి జస్ట్ 64 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఆరావళి కొండలతో అత్యంత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సందర్శకులు బోటింగ్, కయాకింగ్, ఇతర వాటర్ గేమ్స్ ఆడే అవకాశం ఉంటుంది. సరస్సు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతత, సహజ సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
⦿ మోర్ని కొండలు
ఇవి హర్యానాలోని పంచకుల జిల్లాలో ఉన్నాయి. ఢిల్లీ నుంచి 254 కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. హిమాలయాలలోని శివాలిక్ శ్రేణిలో ఉన్న మోర్ని కొండలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అద్భుతమైన హిల్ స్టేషన్ ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటుంది. ఎటు చూసినా పచ్చదనం, నిర్మలమైన సరస్సులు ఆకట్టుకుంటాయి. దట్టమైన అడవుల గుండా ట్రెక్కింగ్ చెయ్యొచ్చు. లేదంటే మోర్ని సరస్సు లో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
Read Also: దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు ఇవే, ఏక బిగిన ఎన్ని కిలో మీటర్లు నడుస్తాయంటే?