BigTV English

Jio: జియో రూ. 198 vs రూ. 199 రీఛార్జ్ ప్లాన్‌.. ఒక్క రూపాయి తేడా.. ఎక్కువ ప్రయోజనాలు ఎందులో అంటే?

Jio: జియో రూ. 198 vs రూ. 199 రీఛార్జ్ ప్లాన్‌.. ఒక్క రూపాయి తేడా.. ఎక్కువ ప్రయోజనాలు ఎందులో అంటే?

Jio cheapest recharge plans: ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల తమ మంత్లీ, ఇయర్లీ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచుతూ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీంతో చాలామంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్ అవడం స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో తమ మిగతా కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోకుండా టెలికాం సంస్థలు కొత్త కొత్త ఆఫర్లను తీసుకు వస్తున్నాయి.


అందులో ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ముందు వరుసలో ఉంది. వరుసగా కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తూ తమ వినియోగదారుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలా రకాల ప్లాన్‌లను తీసుకొచ్చింది. అందులో తక్కువ ధరలో కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. అందువల్ల మీరు కూడా జియో యూజర్ అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది.

వాస్తవానికి టెలికాం కంపెనీ జియో తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఖరీదైనవిగా మార్చినప్పటి నుండి ప్రజలు చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జియో కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. తద్వారా కస్టమర్లు ఇతర టెలికాం ప్రొవైడర్‌లకు మారరుని భావిస్తుంది. మరి జియో నుంచి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. జియో రూ.198, రూ. 199 చౌక ప్లాన్‌ను కలిగి ఉంది. రెండు ప్లాన్‌ల మధ్య కేవలం ఒక రూపాయి మాత్రమే వ్యత్యాసం ఉన్నప్పటికీ సర్వీస్ వాలిడిటీ, రోజువారీ డేటా ప్రయోజనాలు చాలా భిన్నంగా ఉంటాయి. కంపెనీ ఈ రెండు ప్లాన్‌లలో లభించే తేడాలు, ప్రయోజనాల గురించి తెలియజేసింది. మరింత 5G డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ ప్లాన్ గొప్ప ఎంపికగా చెప్పుకోవచ్చు.


Also Read: జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు.. మొత్తం ఎన్ని.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్

జియో నుంచి అందుబాటులో ఉన్న అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్‌లలో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో కంపెనీ తన వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 100 ఉచిత SMS, 2GB డేటాను అందిస్తుంది. దీనితో పాటు కస్టమర్లు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌లకు కూడా యాక్సెస్ పొందుతారు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇంటర్నెట్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం 14 రోజులు వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంది.

రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్

జియో నుంచి అందుబాటులో ఉన్న మరో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లలో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒకటి. ఇది రూ. 198 ప్లాన్ కంటే ఎక్కువ వాలిడిటీతో వస్తుంది. ఇందులో కంపెనీ తన కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, డైలీ 1.5 GB డేటా, 100 SMSలను అందిస్తుంది. దీనితో పాటు JioCinema, JioTV, JioCloudకి కూడా యాక్సెస్ ఇస్తోంది. Jio సినిమా ప్రీమియం Jio సినిమా యాక్సెస్‌లో చేర్చబడలేదు. అలాగే ఈ ప్లాన్‌తో అపరిమిత 5Gని పొందవచ్చు. ఈ ప్లాన్ 18 రోజుల వాలిడిటీతో వస్తుంది.

Related News

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×