E-Paper
Advertisement

Surya Grahan 2024: పితృపక్ష అమావాస్య రోజు సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా ?

Surya Grahan 2024: పితృపక్ష అమావాస్య రోజు సూర్యగ్రహణం.. ఇండియాలో కనిపిస్తుందా ?
Advertisement

Surya Grahan 2024: ప్రతి సంవత్సరం చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. 2024లో రెండవ సూర్యగ్రహణం పితృపక్షం సందర్భంగా ఏర్పడబోతోంది. శ్రద్ధా పక్షం ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రారంభమై.. అక్టోబర్ 2న ముగియనుంది. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 2న అంటే సర్వ పితృ అమావాస్య రోజు ఏర్పడుతుంది. సర్వ పితృ అమావాస్య రోజు ఏర్పడే సూర్యగ్రహణం ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది ? ఇండియాలో కనిపిస్తుందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 2 వ తేదీన రాత్రి 9:13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. 03:17 గంటలకు ముగుస్తుంది. దీని వ్యవధి సుమారు 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సంవత్సరం రెండవ సూర్యగ్రహణం అశ్విన్ అమావాస్య రోజున జరుగుతుంది. ఈ రోజు పితృపక్ష అమావాస్య తిథి అవుతుంది. అందు వల్ల ఈ గ్రహణానికి కొంత ప్రాముఖ్యత ఉంది.

Advertisement

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. భారతదేశంలో కాకుండా దక్షిణ అమెరికా, ఆర్కిటిక్, అర్జెంటీనా, బ్రెజిల్ లోని ఉత్తర ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. పెరూ, చిలీ, దక్షిణాఫ్రికా, పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం కన్య రాశి, హస్తా నక్షత్రంలో సంభవిస్తుంది. దీంతో పాటు ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కేతువులు ఈ గ్రహంలో సంచరించనున్నారు. దేవ గురు బృహస్పతి గ్రహాల రాకుమారుడు అంగారకుడు యొక్క పూర్తి ప్రభావం ఈ రాశులపై ఉంటుంది. సూర్యుడు నుంచి రెండవ రాశిలో శుక్రుడు సంచరిస్తాడు. తిరోగమన శని ఆరవ ఇంట్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని రాశుల వ్యక్తులు అనేక ప్రయోజనాలు పొందుతారు .

Advertisement

Also Read: శని ప్రదోష వ్రతం విశిష్టత.. పూజా నియమాలు

సూర్య గ్రహణం సమయంలో కర్కాటక, వృశ్చిక రాశిలో వారికి అన్ని రంగాల్లో విజయాలు దక్కుతాయి. ఆర్థిక లాభాలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఇవే కాకుండా మేష, వృషభ, సింహ, మీనరాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతే కాకుండా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే మంచిది. లేకుంటే మీకు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×