JioCoin : రిలయన్స్ బ్లాక్‌చెయిన్ ఆధారిత ‘JioCoin’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఏంటి ఈ జియో కాయిన్స్? ఎలా ఉపయోగించాలి? ఎలా పొందాలి? వీటితో లాభాలు ఏంటి? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం.
JioCoins అనేవి బ్లాక్‌చెయిన్ ఆధారిత రివార్డ్ టోకెన్‌లు. జియో ప్లాట్‌ఫారమ్స్ లో మొబైల్ లేదా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే యాప్‌లలో పలు రకాల సేవలను పొందటానికి యూజర్స్ వీటిని ఉపయోగించవచ్చు.
ఇండియా ఫస్ట్ క్రిప్టో కరెన్సీ జియో కాయిన్ ను రిలయన్స్ జియో పరిచయం చేసింది. దీంతో ఈ సంస్థ బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పాలిగాన్ ల్యాబ్స్ ప్రకారం.. జియో ప్లాట్‌ఫారమ్స్ ఎంపిక చేసిన అప్లికేషన్‌లు, సేవలలో వెబ్3 సామర్థ్యాలను ఏకీకృతం చేయటమే ఈ పార్టనర్ షిప్ ముఖ్య ఉద్దేశ్యం.
JioCoin అంటే ఏంటి –
JioCoin అనేది బ్లాక్ చెయిన్ ఆధారిత రివార్డ్ టోకెన్. ఈ టోకెన్‌లు ఇండియన్ మెుబైల్ నెంబర్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. Jio ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల వాలెట్‌కు క్రెడిట్ చేసిన టోకెన్‌ల సంఖ్య.. Jio యాప్‌లతో యూజర్స్ ఎంగేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది.
JioCoins ఎలా ఉపయోగించాలంటే –
JioCoins విలువతో పాటు వాటిని ఎలా ఉపయోగించాలో రిలయన్స్ వివరించనప్పటికీ.. మొబైల్ రీఛార్జ్‌లు, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఇతర Jio సేవల కోసం టోకెన్‌లను ఉపయోగించవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
JioCoins ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయడం ఎలా –
మొబైల్ సెంట్రిక్ యాప్‌లలో, ప్రొఫైల్ విభాగం క్రింద సైన్ అప్ అవ్వొచ్చు. యుటిలిటీ యాప్‌లలో సైతం ఇది టాప్ మెనూలో ఉంటుంది. ప్రస్తుతం JioCoins JioSphere వెబ్ బ్రౌజర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే Jio ప్లాట్‌ఫారమ్‌లు JioCinema వంటి ఇతర యాప్‌లకు సైతం త్వరలోనే విస్తరింపచేయాలనే ఆలోచన చేస్తున్నాయి.
బ్లాక్‌చెయిన్ –
బ్లాక్‌చెయిన్ అనేది డిజిటల్ డేటాబేస్. ఇది కంప్యూటర్‌ల నెట్‌వర్క్‌లోని లింక్డ్ బ్లాక్‌లలో డేటాను స్టోర్ చేస్తుంది. ఈ టెక్నాలజీ స్టోరేజ్ లో ఉంచిన డేటా సురక్షితంగా ఉందని, నెట్‌వర్క్ అంతటా ఒకే పర్మిషన్ లేకుండా మార్చే ఛాన్స్ లేదని నిర్ధారిస్తుంది. ఆర్డర్‌లు, చెల్లింపులు, ఖాతాలతో సహా లావాదేవీలలో సైతం మార్చలేని రికార్డులను నిర్వహించడానికి ఇది బెస్ట్ ఆఫ్షన్.
బ్లాక్‌చెయిన్‌లోని ప్రతి బ్లాక్‌లో టైమ్‌స్టాంప్, లావాదేవీ డేటా, ముందు బ్లాక్ కు సంబంధించిన క్రిప్టోగ్రాఫిక్ హాష్ ఉంటాయి. లావాదేవీలను సురక్షితంగా రికార్డ్ చేయడానికి Bitcoin, Ethereum వంటి క్రిప్టోకరెన్సీలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఆధారపడతాయి.
Web3 అంటే ఏమిటి –
Web3 లేదా Web 3.0 అనేది వరల్డ్ వైడ్ వెబ్ (WWW) మూడో తరాన్ని సూచిస్తాయి. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. ఇక ఇంతకు ముందు వచ్చిన వాటిలా కాకుండా Web3.. డేటాను నియంత్రించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. పబ్లిక్‌గా యాక్సెస్ చేయగల బ్లాక్ చెయిన్‌లలో రికార్డ్ చేసిన పారదర్శక లావాదేవీలను సులభతరం చేస్తుంది.
ALSO READ : ఆ మెుబైల్ పై ఏకంగా రూ.18వేల తగ్గింపు.. లిమిటెడ్ సేల్ బాస్!