BigTV English

EPF Account: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. ఇక మరింత ఈజీగా..?

EPF Account: పీఎఫ్ ఖాతాదారులకు సూపర్ న్యూస్.. ఇక మరింత ఈజీగా..?

EPF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది ఖాతాదారులు తరచుగా వారి ఈపీఎఫ్‌వో ఖాతాలకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఖాతా బదిలీలు, వ్యక్తిగత వివరాలను నవీకరించడం లేదా కంపెనీ నుండి నిష్క్రమించే తేదీని నమోదు చేయడం వంటి సమస్యలు ఉద్యోగులకు నిరాశను మిగుల్చుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి,ఈపీఎఫ్‌వో ​​నిరంతరం మార్పులు చేస్తోంది.


తాజాగా ఖాతా బదిలీలకు సంబందించి ప్రాసెస్ మరింత సులభతరం చేస్తుంది. ఇప్పుడు PF ఖాతాదారుల పేరు, బర్త్ డే వంటి వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. ఇకపై యాజమాని గాని ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో ఈజీగా మార్చుకునే వీలు కల్పించింది. ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ ఖాతాలను యజమాని పర్మిషన్ లేకుండానే బదిలీ చేసుకునే సదుపాయాన్ని కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుక్ మాండవియ ఈ సేవలను రెండు రోజుల క్రితం ప్రారంభించారు. వీటివల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు ఖాతాదారులపై పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించారు.

2017 అక్టోబర్ 1 తర్వాత ఓపెన్ చేసిన యుఎన్ఏ ఖాతాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వివరాలను ఛేంజ్ చేసుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు. 2017 అక్టోబర్ 1 ముందు జారీ అయిన యూనియన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు. ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు అధికారులు తెలిపారు.


ఆధార్ కార్డుతో లింక్ చేయని యూఎన్ఏ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యాజమానానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది. జాబ్‌లో చేరే సమయంలో ఆయా సంస్థలు పేర్లు, వైవాహిక స్థితి సర్వీసు వివరాలు నమోదు చేయడంలో తప్పులు జరిగే అవకాం ఉండడంతో.. ఇలాంటి తప్పులను సరి చేయడానికి ఉద్యోగులు ఆన్‌లైన్‌లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపిస్తారు. ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్ గా నిర్వహిస్తారు.

ఒక 2024-25 ఈ సంవత్సరంలోనే 8 లక్షల రిక్వెస్ట్ లు వచ్చాయని మాండవియా తెలిపారు.  తాజా నిర్ణయంతో 45% మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో 50% కరెక్షన్లు యాజమాన్యం దగ్గర ఉన్నాయని పరిష్కారం కానున్నాయని తెలిపారు.  ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యాజమాని వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

Also Read: Central Bank of India Jobs: జస్ట్ డిగ్రీ పాసై ఉంటే చాలు.. అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.86,000

 ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులు ఆధార్ ఓటిపి ఎంటర్ చేసి యజమాని చోక్యం లేకుండానే బదిలీ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా బదిలీ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్‌లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఓకే అభ్యర్థన పెట్టుకోవచ్చు. ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ అభ్యర్థులను ఈపీఎఫ్ కు చేరడానికి 12 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×