Akshay Kumar: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేది తెలివైనవారు పని. అలా తెలివిగా ఆలోచించడంలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ముందు ఉంటాడు. బాలీవుడ్ లో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే హీరోల్లో అక్షయ్ ఒకడు. కామెడీ అయినా, యాక్షన్ అయినా, మెసేజ్ ఓరియెంటెడ్ అయినా, ప్రయోగం అయినా.. కథ ఏదైనా అక్షయ్ ఓకే అన్నాడు అంటే అది మినిమమ్ గ్యారెంటీ సినిమా అని చెప్పుకోవచ్చు.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే బాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది అక్షయ్ కుమార్. ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఒక్కోసారి అక్షయ్ సినిమాల కంటే యాడ్స్ లోనే ఎక్కువ కనిపిస్తాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. విమలా పాన్ దగ్గర నుంచి కార్ల యాడ్ వరకు ఇప్పటివరకు అక్షయ్ చేయని ప్రకటనలు లేవు.
ఇకపోతే తాజాగా అక్షయ్.. ఒక ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అది ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్ బారిన పడింది. అదేంటి.. ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే ఏమవుతుంది అని డౌట్ రావచ్చు. అయితే.. అక్షయ్ కుమార్.. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. రోబో 2.ఓ. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. పక్షిరాజు పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Saif Ali Khan: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్..
రోబో 2.ఓ ఆశించినంత ఫలితాన్ని అందించలేకపోయినా.. అకహై పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఫోన్ లో ఉండే రేడియేషన్ వలన పక్షులు అంతరించిపోతాయని పోరాటం చేసే పక్షి రాజుగా ఆయన నటన అద్భుతం. ఈ పాత్ర నిజ జీవితంలో కూడా ఉంది. బర్డ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సలీమ్ ఆలీని ఇన్స్ఫైర్ అయ్యి శంకర్ పక్షిరాజును మలిచినట్లు తెలిపాడు. ఇక ఇందులో ఎవరు ఫోన్ వాడకూడదని చెప్పిన అక్షయ్.. ఇప్పుడు ఇలా ఫోన్ వాడమని చెప్పడం ఏంటి.. ? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సరే.. అది సినిమా. అందరూ సినిమాలో చేసినట్లుగా బయటకూడా చేయలేరు కదా అని అంటే.. ఈ ఫోన్ యాడ్ లో కూడా అక్షయ్ పక్షిరాజు పోలికలతో కనిపించడం వివాదంగా మారింది. పక్షిరాజు కళ్లతో ఫోన్ ను చూపిస్తూ ఆ ఫోన్ లో ఉండే ఫీచర్స్ ను చూపిస్తూ వచ్చాడు. దీంతో పక్షిరాజే ఫోన్ వాడమని చెప్తున్నాడు.. ఇదసలు ఊహించలేదు అని కొందరు. పక్షిరాజును అక్షయ్ అవమానిస్తున్నాడు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధించిన యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.