BSNL National Wifi Roaming Service : ప్రముఖ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ( BSNL ) తన కస్టమర్స్ కోసం అదిరిపోయే వైఫై ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు BSNL FTTH వినియోగదారులు.. వారి రూటర్ పరిధిలో మాత్రమే ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలిగే అవకాశం ఉండగా.. తాజాగా నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ తో బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలను దేశంలో ఎక్కడైనా వినియోగించే అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు తన కస్టమర్ కోసం అదిరిపోయే ప్లాన్స్ ను తీసుకొస్తున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ ( BSNL ) తమ వినియోగదారుల కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ ప్రైవేట్ టెలికాం (Private Telecom Services) సంస్థలన్నీ వరుసగా టారీఫ్ ఛార్జీలను పెంచినప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల వినియోగదారులు BSNL సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ తన సేవలను మరింత విసృతం చేసే పనిలో పడింది. ఇప్పటికే 4G, 5G నెట్‌వర్క్ ను తీసుకొచ్చి బెస్ట్ ప్లాన్స్ ను అందిన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా జాతీయ Wi-Fi రోమింగ్ సేవ (BSNL National Wifi Roaming Service) ను ప్రారంభించింది. ఇది BSNL FTTH (ఫైబర్ టు ది హోమ్) వినియోగదారులను భారత్ అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ ప్లాన్ ను పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం BSNL FTTH కస్టమర్స్ నిర్ణీత ప్రదేశంలో మాత్రమే హై స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందుతున్నారని… ఈ ప్లాన్ తో కస్టమర్స్ భారత్ లో ఎక్కడినుంచైనా హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలరని తెలిపింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారులు హై స్పీడ్ FTTH నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చని.. అయితే ఈ సదుపాయాన్ని పొందేందుకు వినియోగదారులు తప్పనిసరిగా బిఎస్ఎన్ఎల్ FTTH ప్లాన్‌ని కలిగి ఉండాలని తెలిపింది.
ఇక బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు BSNL FTTH జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను వినియోగించుకోవడానికి తప్పనిసరిగా బీఎస్‌ఎన్ఎల్ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ అవ్వాలి. BSNL అధికారిక వెబ్ సైట్ https://portal.bsnl.in/ftth/wifiroaming లో రిజిష్టర్ చేసుకోవాలి. ఇక ఈ రిజిస్ట్రేషన్ సమయంలోనే వినియోగదారులు ప్రాసెస్ పూర్తి చేసుకోవడానికి FTTH కనెక్షన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఎంటర్ చేయాలని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు సైతం బీఎస్‌ఎన్‌ఎల్ వైఫై కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందే అవకాశం ఉంటుందని తెలపింది.
జాతీయ Wi-Fi రోమింగ్ సర్వీస్ ప్రయోజనాలు :
BSNL నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతీ చోటా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు.
గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ బీఎస్ఎన్ఎల్ సేవలు ఉపయోగించే అవకాశం
ఎక్కడి నుంచైనా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందే అవకాశం
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ప్రతీ చోటా ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశం
కస్టమర్స్ నెట్ వర్క్ ను ఈజీగా వాడుకునే అవకాశం