Action Movie In OTT : యాక్షన్ మూవీలను ఇండస్ట్రీలోకి అందరు ఇష్టపడతారు. కొన్ని సినిమాలు బలమైన కథతో పాటుగా అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉండటంతో ఎక్కువ మంది సినిమాలను చూడటం కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్య యాక్షన్ కథలతో వస్తున్నా మూవీలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఓటీటిలో ఇటీవల సందడి చేస్తున్న ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఓటిటి మూవీ ఒకటి థియేటర్లలో యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటిలోకి వచ్చేస్తుంది. ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనేది వివరంగా తెలుసుకుందాం..
బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న కేజీఎఫ్, సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథను అందించిన కన్నడ మూవీ బఘీర థియేటర్లలో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలతో రావడంతో ఆ సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ అయితే అందుకోలేదు. కలెక్షన్స్ మాత్రం మామూలుగానే వచ్చాయని తెలిసిందే.. ఈ మూవీ ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటిలో సందడి చేయబోతుంది. ఇక సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీలో శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించారు. సూరి దర్శకత్వం వహించాడు.. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన బఘీర మూవీ థియేటర్లలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయనే పేరొచ్చిన ప్రశాంత్ నీల్ కథ, కథనాల్లో వేరేలా ఏమి లేదని రొటీన్ స్టోరీని చూసిన ఫీలింగ్ వచ్చిందనే టాక్ ను మూటకట్టుకుంది. ఆ తర్వాత కలెక్షన్స్ కూడా అంతంత మాత్రం రావడంతో సినిమాకు అనుకున్న టాక్ రాలేదు.
కేజీఎఫ్, సలార్ స్థాయిలో బఘీరలో ఎమోషన్స్ వర్కవుట్ కాకపోవడంతో మోస్తారు వసూళ్లను మాత్రమే ఈ మూవీ దక్కించుకున్నది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 32 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. నిర్మాతలకు అటు లాభాలను, ఇటు నష్టాలను తెచ్చిపెట్టకుండా సరిగ్గా సమానంగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ అప్పుడే ఓటీటిలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. బఘీర మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సూపర్ హీరో మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. కన్నడంతో పాటు ఓకే రోజు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. నిజాయితీగా ఉద్యోగం తెచ్చుకున్నా అని హీరో ఆయన కింద ఉన్న నగరంలో క్రిమినల్స్ లేకుండా ఏరి పాడేస్తాడు.. ఇక తనకు జాబ్ తండ్రి లంచం ఇవ్వడం వల్లే వచ్చిందని తెలుసుకొని బాధ పడతాడు. ఆ తర్వాత అన్యాయం వైపు చూడకుండా ఉంటాడు. ఆ తర్వాత స్టోరీ ఏ మలుపు తిరుగుతుంది అనేది స్టోరీ.. ఇక ఓటీటీలోకి ఈ నెలాఖరున స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఇక్కడ ఆకట్టుకోలేని మూవీ అక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..