Big Stories

New Planets : మూడు కొత్త గ్రహాలు గుర్తింపు.. కెప్లెర్ సాయంతో..

New Planets : భూమితో పాటు మరో ఎనిమిది గ్రహాలు కూడా సోలార్ సిస్టమ్‌లో ఉంటాయని చాలామందికి తెలిసిన విషయమే. కానీ మనకు తెలియకుండానే మరెన్నో ఇతర గ్రహాలు కూడా అక్కడ ఉంటాయని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. ఆ గ్రహాలు అన్నింటి గురించి తెలుసుకోవడం సులువైన విషయం కాకపోయినా.. వారి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వాటికోసమే ప్రత్యేకంగా ఎన్నో టెలిస్కోప్‌లు తయారయ్యాయి. తాజాగా కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఆస్ట్రానాట్స్ మరెన్నో గ్రహాలను కనిపెట్టారు.

- Advertisement -

కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్ కనుక్కున్న చివరి మూడు గ్రహాల గురించి ఆస్ట్రానాట్స్ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. సోలార్ సిస్టమ్ బయట ఇప్పటికే 5000కు పైగా గ్రహాలు ఉన్నాయని ఆస్ట్రానాట్స్ నిర్ధారించారు. ఇప్పటికే వాటిలో సగానికి పైగా గ్రహాలను నాసాకు చెందిన కెప్లెన్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. గత తొమ్మిదిన్నర ఏళ్లలో భూమిని స్టడీ చేస్తూ ఈ టెలిస్కోప్ తిరిగింది. స్టార్‌లైట్ గురించి కూడా పలు కొత్త విషయాలు కనిపెట్టింది ఈ టెలిస్కోప్. ఫ్యూయల్ అయిపోయేలోపు కూడా ఈ టెలిస్కోప్ నక్షత్రాలను స్టడీ చేస్తూ ఉండిపోయింది.

- Advertisement -

2018 అక్టోబర్ 30న కెప్లెర్ టెలిస్కోప్ ఫ్యూయల్ అయిపోయింది. దీంతో ఇది అధికారికంగా రిటైర్ అయిపోయింది. తాజాగా ఈ టెలిస్కోప్‌లో స్టోర్ అయ్యి ఉన్న డేటాను ఆస్ట్రానాట్స్ వెతికి చూశారు. ఇందులో మూడు ప్రకాశవంతమైన నక్షత్రాలను వారు గుర్తించారు. ఇవి వారికి చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఇందులోని రెండు స్టార్లు ఒక గ్రహానికి సంబంధించినవి అని, మరొక నక్షత్రం గ్రహానికి సంబంధించిందే అని ఆస్ట్రానాట్స్ నిర్ధారించారు. ఈ గ్రహాల పేర్లు కే2-416, కే2-417 అని గుర్తించారు.

కే2-416 అనే గ్రహం 2.6 రెట్లు భూమికంటే పెద్దగా ఉంటుందని ఆస్ట్రానాట్స్ తెలిపారు. ఇది ప్రతీ 13 రోజులకు ఒకసారి నక్షత్రానికి ఆర్బిట్ లాగా చుట్టూ తిరుగుతుంది. ఇక కే2-417 అనేది మరికొంత పెద్ద గ్రహం అని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. ఇది భూమికంటే 3 రెట్లు పెద్దగా ఉంటుందని తెలిపారు. ఇది నక్షత్రం చుట్టూ 6.5 రోజులకు ఒకసారి ఆర్బిట్ చేస్తుందని అన్నారు. ఈ రెండు గ్రహాలకు హాట్ మిని నెప్ట్యూన్స్ అని పేరుపెట్టారు. ఇవి భూమికంటే 400 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయని ఆస్ట్రానాట్స్ నిర్ధారించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News