Big Stories

North Korea : నార్త్ కొరియా మొదటి ప్రయోగం ఫెయిల్.. ఊపిరిపీల్చుకున్న దేశాలు..

North Korea : ఇప్పుడు చాలా ప్రపంచ దేశాలు టెక్నాలజీ విషయంలో పోటీపడడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. నువ్వెంత అంటే నేనెంత అంటూ పరిశోధనలు చేస్తున్నారు. కానీ అన్ని పరిశోధనలు ఒకే విధంగా సక్సెస్ అవుతాయని గ్యారెంటీ ఇవ్వలేము. అలాగే తాజాగా నార్త్ కొరియా భారీ పతకంతో ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కంటే ముందే ఫెయిల్ అయ్యింది. అందుకే మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ను ఎలాగైనా సక్సెస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

- Advertisement -

నార్త్ కొరియా మొదటిసారి ఒక స్పై శాటిలైట్‌ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. తయారు చేసింది కూడా. కానీ అది అనుకున్న రీతిలో సక్సెస్ అవ్వలేదు. లాంచ్ వెహికల్ ప్రారంభం అయిన వెంటనే పలు సాంకేతిక లోపాలతో యెల్లో సీ లో పడిపోయింది. దీంతో నార్త్ కొరియాకు ఊహించని దెబ్బ తగిలింది. అయినా కూడా వెనకడుగు వేసేది లేదని త్వరలోనే మళ్లీ ఇలాంటి ఒక ప్రయోగం చేసి చూపిస్తామని ఈ దేశ ప్రభుత్వం సవాలు విసిరింది. వీలైనంత వెంటనే చేస్తామని బయటపెట్టింది.

- Advertisement -

ఈ లాంచ్ ఫెయిల్ అవ్వడం వల్ల సౌత్ కొరియా, జపాన్ అలర్ట్ అయ్యింది. జపాన్ ప్రభుత్వం ఈ స్పై శాటిలైట్ వల్ల తమ ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని భయపడి అందరికీ అలర్ట్ పంపించారు. ఆ తర్వాత శాటిలైట్ ప్రయోగం ఫెయిల్ అవ్వడంతో మళ్లీ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోహియా శాటిలైట్ లాంచ్ సైట్ నుండి నార్త్ కొరియా స్పై శాటిలైట్ టేక్ ఆఫ్ అయ్యింది. రాకెట్ ఇంజెన్ సరిగా లేకపోవడంతో సెకండ్ స్టేజ్‌లోనే దీని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. ఆపై ఫెయిల్ అయ్యిందని నిర్ధారణ అయ్యింది.

యెల్లో సీ లో పడిన స్పై శాటిలైట్ చిత్రాలను నార్త్ కొరియా మీడియా విడుదల చేసింది. ఈ రాకెట్ టెక్నాలజీ గురించి అప్పుడే సౌత్ కొరియా శాస్త్రవేత్తలు శోధించడం మొదలుపెట్టారు. నార్త్ కొరియా ఇలాంటి ఒక శాటిలైట్ లాంచ్ చేస్తుంది అని ప్రకటించిన వెంటనే జపాన్ ప్రభుత్వం.. తమ ఆర్మీకి ఆదేశాలు పంపింది. టెర్రిటరీలోకి ప్రవేశించిన ఏ అనుమానమైన వాహనాన్ని అయినా కాల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, సౌత్ కొరియా ఈ లాంచ్‌కు వ్యతిరేకంగా ఉన్నారు కూడా. వీటికి మరిన్ని దేశాలు మద్దతును పలికాయి. కానీ దీని ఫెయిల్యూర్ ఆ దేశాలు ఊపిరి పీల్చుకునేలా చేస్తే.. నార్త్ కొరియా ప్రభుత్వం మాత్రం నిద్రపోకుండా చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News