BigTV English

Government OTT @ Rs 75: రూ.75కే ఒటీటీ సినిమాలు.. దేశంలోనే తొలి ప్రభుత్వ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్

Government OTT @ Rs 75: రూ.75కే  ఒటీటీ సినిమాలు.. దేశంలోనే తొలి ప్రభుత్వ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్

Kerala Govt OTT C Space


Kerala Govt OTT ‘C Space’ Price is Rs 75: ఈరోజుల్లో థియేటర్లో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీలోకి రావాల్సిందే. ఓటీటీ మార్కెట్‌కు ఇప్పుడున్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ప్రపచవ్యాప్తంగా ఓటీటీ నుంచి ఏటా 25 శాతం ఆదాయం నమోదౌతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. భారత్‌తో సహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ మార్కెట్‌లు విస్తరిస్తున్నాయి. ఓటీటీ వినియోగించే వారి సంఖ్య కూడా గతేదాడితో పోలిస్తే 30 శాతం పెరిగింది. అయితే ఇప్పటిదాకా ప్రైవేటు సంస్థలకు మాత్రమే పరిమితమైన ఓటీటీ సేవలు ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు అందించనున్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం కేరళ సీఎం పినరయి విజయన్‌ కైరాలీ థియేటర్‌లో ఓటీటీ సీస్పేస్‌ ఫ్లాట్ఫామ్‌‌ ప్రారంభించారు. ‌భారతదేశంలో తొలి ప్రభుత్వ రంగ ఓటీటీగా సీస్పేస్‌ నిలించిందని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ తెలిపారు. ఇది కేరళ రాష్ట్ర డిజిటల్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ రంగంలో సంచలనం సృష్టిస్తుందని పేర్కొన్నారు.వినోదభరితమైన కంటెంట్‌ ను అందించడమే తమ లక్ష్యమని కేరళ ప్రభుత్వం తెలిపింది. ఓటీటీలో ప్రత్యేకించి ప్రజల కోసం రూపొందించిన విజ్ఞాన సమాచారం, వినోదభరితమైన కంటెంట్‌ ఉండనుంది.


READ MORE: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

ప్రస్తుతం ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌ ఎంపికలో చాలా తేడాలున్నాయని కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ షాజీ ఎన్‌ కరున్‌ అన్నారు. వాటి ప్రసారాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. వాటికి ప్రతిస్పందనగా సీస్పేస్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు.

స్పీసేస్‌ ఓటీటీని కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ నిర్వహించనుంది. ఈ ఫ్లాట్‌ఫామ్ మలయాళ సినిమా, సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. కంటెంట్‌‌ను కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఎంపిక చేస్తుంది. కంటెంట్‌ని ఎంపిక చేయడం, ఆమోదించడం కోసం 60 మంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరి ఆమోదం తర్వాతే కంటెంట్‌ ప్రసారమవుతుంది.

READ MORE: ఈ ఏసీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. ఇదే మంచి ఛాన్స్ గురూ

కంటెంట్ ప్యానల్‌లో మెంబర్లుగా బెన్యమిన్,సంతోష్ శివన్, ఓవీ ఉషా, శ్యామప్రసాద్, జియో బేబీ , సన్నీ జోసెఫ్,వంటి సీనియర్లు ఉండనున్నారు. వీరంతా కలిసి సీస్పేస్ యాప్‌ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది వీరి చేతుల్లోనే ఉంటుంది. మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని తెలిపారు. ఈ యాప్‌లో సినిమాలు చూడాలనుకుంటే రూ.75 చెల్లించాలని తెలుస్తోంది. అలా పే పర్ వ్యూ స్కీమ్‌తో సీస్పేస్ రన్ కానుంది.

Tags

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×