BigTV English

Demolished MLA Marri Rajasekhar Reddy Buildings : మల్లారెడ్డి అల్లుడు కబ్జాల దందా.. అక్రమ కట్టడాలు కూల్చివేత

Demolished MLA Marri Rajasekhar Reddy Buildings : మల్లారెడ్డి అల్లుడు కబ్జాల దందా.. అక్రమ కట్టడాలు కూల్చివేత

mallareddy college demolition


Demolished MLA Marri Rajasekhar Reddy College Buildings: హైదరాబాద్ శివార్లలో 8 ఎకరాల కబ్జా. దుండిగల్ సమీపంలో 8 ఎకరాలు వందల కోట్లతో సమానం. ప్రజలకు ఉపయోగపడాల్సిన స్థలం తమ సొంతమన్నట్టు కట్టడాలు కట్టేశారు. అధికారంలో ఉన్నది మనోళ్లే, అడిగేది ఎవరంటూ భవనాలు కట్టేశారు. ఇప్పుడు సీన్ మారింది. అక్రమ కట్టడాల కూల్చేకాలం మొదలైంది.

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డికి‌ భారీ‌ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలోని ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. చిన్నదామెర చెరువును కబ్జా చేసి వాటిని నిర్మించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఆ కట్టడాలను కూల్చివేశారు.


గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ మూడు శాఖల అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కుత్బుల్లాపుర్‌ ఎంఎల్ఏ వివేకానంద, కళాశాల అధినేత మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Read More: చేతులెత్తేసిన బీఆర్ఎస్..!

చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల్ని యాజమాన్యం ఎగదోస్తోంది. దీంతో కొందరు విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్‌ పైకి ఎక్కారు. ఆందోళనకు దిగారు. ఇటు కూల్చివేతలకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను స్టాఫ్‌ కూడా అడ్డుపడే ప్రయత్నం చేశారు. అటు ఎమ్మెల్యేలు రాజశేఖర్‌రెడ్డి, వివేకానంద ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×