Air Coolers Key Details | వేసవి కాలం రాకముందే ఇప్పటి నుంచే ఎండలు మండుతున్నాయి. అందుకే ఇప్పటి నుంచే అందరూ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లను ఉపయోగిస్తున్నారు. ఏసీ ధరలు ఎక్కువగా ఉండడం, ఫ్యాన్ గాలి వేడిగా వస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కూలర్లు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. వాటిని బట్టి కొనుగోలు చేయాలి. కూలర్లలో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ముందుగా మీ గది పరిమాణాన్ని బట్టి కూలర్‌ను ఎంచుకోవాలి. 200-300 చదరపు అడుగుల గది ఉంటే పర్సనల్ కూలర్ సరిపోతుంది. అంతకంటే పెద్ద గది ఉంటే డిసర్ట్ కూలర్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
వాతావరణం బట్టి కూలర్లు:
పొడి వాతావరణంలో డిసర్ట్ కూలర్స్ బాగా పనిచేస్తాయి. తేమ వాతావరణంలో (తీర ప్రాంతాల్లో) నివసించే వారు పర్సనల్, టవర్ కూలర్లు తీసుకోవడం ఉత్తమం.
వాటర్ ట్యాంక్ కెపాసిటి:
కూలర్ కొనుగోలు చేసే ముందు వాటర్ ట్యాంక్ సామర్థ్యాన్ని గమనించాలి. చిన్న గది ఉంటే 15-25 లీటర్లు, కాస్త పెద్ద గది ఉంటే 25-40 లీటర్లు, ఇంకా పెద్ద గది ఉంటే 40 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కూలర్‌ను తీసుకోవడం మంచిది.
కూలర్ ఆన్ చేయగానే వచ్చే శబ్దం:
కూలర్ కొనే ముందు నాయిస్ లెవెల్‌ను (శబ్దం) తనిఖీ చేయడం మంచిది. కొన్ని కూలర్లు ఆన్ చేసినప్పుడు ఎక్కువ శబ్దం చేస్తాయి, మరికొన్ని తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. షోరూమ్‌లో కొనుగోలు చేసే ముందు దీనిని కూడా తనిఖీ చేయాలి.
ఆటో ఫిల్ ఆప్షన్:
కొన్ని కూలర్లలో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది. నీరు ఖాళీ అయినప్పుడు స్వయంచాలకంగా నీటితో నింపుతుంది. ఇలాంటి కూలర్లు తీసుకోవడం వల్ల కూలర్ మోటార్ చెడిపోకుండా ఉంటుంది.
కూలింగ్ ప్యాడ్స్:
ఎయిర్ కూలర్‌కు కూలింగ్ ప్యాడ్స్ కూడా చాలా ముఖ్యం. ఇందులో వివిధ రకాల ప్యాడ్స్ ఉంటాయి. వూల్ వుడ్, యాస్పెన్ ప్యాడ్స్, హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ వంటివి ఉంటాయి. హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ ఎక్కువ కూలింగ్ ఇస్తాయి మరియు మెయింటనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.
కూలర్లలో అదనపు ఫీచర్స్:
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. కూలర్లలో చాలా రకాల ఫీచర్స్ ఉంటున్నాయి. రిమోట్ కంట్రోల్, యాంటీ మస్కిటో ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ లాంటి అదనపు ఫీచర్లను కూడా కూలర్లలో జోడిస్తున్నారు. ఇలాంటి ఫీచర్స్ ఉన్న కూలర్లు అందుబాటులో ఉంటే తీసుకోండి.
ఐస్ ఛాంబర్:
కొన్ని కూలర్లలో ఫాస్ట్ కూలింగ్ కోసం ఐస్ ఛాంబర్స్ ఉంటాయి. అందులో మీరు ఐస్ క్యూబ్స్ వేస్తే ట్యాంక్ త్వరగా చల్లబడుతుంది.
పవర్ యూసేజ్:
కూలర్ వేసినప్పుడు ఎన్ని పవర్ యూనిట్లు వస్తుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. స్టార్ రేటింగ్స్‌ను బట్టి కూలర్‌ను ఎంచుకోండి. ఇన్వర్టర్ టెక్నాలజీతో కూలర్లు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. వీటి వల్ల పవర్ సేవ్ అవుతుంది మరియు కరెంట్ పోయినా కూలర్ కొద్ది సేపు పనిచేస్తుంది..
Also Read: కేబుల్స్‌తో జంజాటం వద్దు.. వైర్ లెస్ మొబైల్ ఛార్జర్ సిద్ధం, ఇలా పనిచేస్తుంది!
ఇప్పుడు చాలా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూలర్‌లపై భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మూడు కూలర్లు సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో మీరు చాలా చౌక ధరలలో వివిధ బ్రాండ్‌లు, మోడల్‌ల కూలర్‌లను పొందవచ్చు. మీ అవసరం, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని మీరు ఈ డీల్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు. కాబట్టి 3 అద్భుతమైన డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
వోల్టాస్ ఎయిర్ కూలర్:
వోల్టాస్ కంపెనీ నుండి వస్తున్న ఈ కూలర్ కూడా పెద్ద తగ్గింపుతో లభిస్తోంది. ఈ కూలర్‌ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ కూలర్‌ను రూ. 11,390కి లాంచ్ చేసింది, కానీ ఇప్పుడు ఈ కూలర్ కేవలం రూ. 5,999కే కొనుగోలు చేయవచ్చు. IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ EMI, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1200 వరకు ఆదా చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 వరకు తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ తర్వాత కూలర్ ధర రూ. 4,499కి తగ్గుతుంది.
బజాజ్ ఎయిర్ కూలర్:
బజాజ్ కంపెనీ నుండి ఈ కూలర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తోంది. కంపెనీ ఈ కూలర్‌పై 28% తగ్గింపును ఇస్తోంది. ఇప్పుడు ఈ కూలర్ కేవలం రూ. 5,299కే కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 వరకు తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1250 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఓరియంట్ ఎయిర్ కూలర్:
ఓరియంట్ కంపెనీ నుండి ఈ కూలర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చౌకగా లభిస్తోంది. కంపెనీ ఈ కూలర్‌ను రూ. 8,990కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు దీన్ని కేవలం రూ. 5,790కే కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 వరకు తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1250 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
ఈ డీల్స్‌లో మీరు మంచి కూలర్‌ను చౌకగా పొందవచ్చు. మీ అవసరాలను బట్టి సరైన కూలర్‌ను ఎంచుకోండి .. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందండి.