Trolls on Babar Azam: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో పాకిస్తాన్ ఘోర ఓటమిని ఆ దేశ క్రీడాభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్ది రోజుల ముందే పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ లో పాకిస్తాన్ ని ఫైనల్ లో ఓడించి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్.. అదే టెంపోని కొనసాగిస్తూ ఛాంపియన్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో గెలుపొందింది. ఈ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్లు వీరంగం ఆడిన పిచ్ పై పాకిస్తాన్ ఆటగాళ్లు బంతిని టచ్ చేయడానికే భయపడ్డారు.
ఈ తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన మహమ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. కరాచీ పిచ్ లో స్వింగ్ తో వికెట్లు తీస్తారని అనుకున్న పాక్ పేసర్లు.. భారీగా పరుగులు సమర్పించుకోవడం మొదలుపెట్టారు. న్యూజీలాండ్ బ్యాటర్లు విల్ యంగ్ 107, టామ్ లాథమ్ 118 పరుగులు చేసి సెంచరీలతో రాణించగా.. గ్లేన్ పిలిప్స్ 39 బంతులలో 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 61 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేసింది. దీంతో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుందని అంతా అనుకున్నారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్లు కూడా అదే రేంజ్ లో వీరబాదుడు బాదుతారని అనుకున్న పాకిస్తాన్ క్రీడాభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అనుభవం లేని న్యూజిలాండ్ పేసర్ల బంతిని తాకేందుకు కూడా పాకిస్తాన్ బ్యాటర్లు భయపడ్డారు. 21 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం 70 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే అర్థం చేసుకోవచ్చు.. పాకిస్తాన్ బ్యాటర్లు ఎలా ఆడారో. మహమ్మద్ రిజ్వాన్, తయ్యూబ్ తాహీర్, సౌద్ షకీల్.. సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. దీంతో పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే వికెట్లు పడకుండా నిదానంగా ఆడుతున్న బాబర్ అజామ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ స్కోర్ చేజింగ్ మ్యాచ్ లో ఈ జిడ్డు ఆట ఏంటని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దిగారు. బాబర్ తన రికార్డుల కోసం సెల్ఫిష్ గా ఆడుతున్నాడని కామెంట్ చేశారు. రూల్స్ ప్రకారం ఫకర్ జమాన్ ఆలస్యంగా బ్యాటింగ్ కి రావాల్సింది. బాబర్ తో కలిసి ఓపెనర్ గా సౌద్ షకీల్ వచ్చాడు. అతడు 19 బంతులలో ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. నిజానికి పాకిస్తాన్ ఓపెనర్లు చాలా స్లోగా స్టార్ట్ చేశారు. షకీల్ అవుట్ అయిన తర్వాత ఫిలిప్స్ సూపర్ మ్యాన్ క్యాచ్ తో కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ని కూడా అవుట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 22 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.
ఆ తరువాత బాబర్ వికెట్లు కాపాడుకునేందుకు స్లోగా ఆడుతున్నాడేమో అనిపించింది. కానీ బాబర్ మరీ స్లోగా ఆడాడు అనేది వాస్తవం. అతడి టెస్ట్ బ్యాటింగ్ వల్ల మరో ఎండ్ లో ఉన్న బ్యాటర్లు రన్ రేట్ కోసం కాస్త వేగంగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరారు. 90 బంతులు ఆడిన బాబర్ అజామ్ 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 64 పరుగులు చేశాడు. దీంతో బాబర్ పై విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. న్యూజిలాండ్ తో బాబర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని, ఆ కారణంగానే ఈ మ్యాచ్ లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు.
Man of the match pic.twitter.com/Ja1mCZkq7l
— Out Of Context Cricket (@GemsOfCricket) February 19, 2025