Big Tv Live Original: సాధారణంగా సెల్ ఫోన్లకు కేబుల్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చేస్తారు. కానీ, కేబుల్ ఛార్జర్ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు కేబుల్స్ తెగిపోతాయి. హెడాప్టర్లు చెడిపోతాయి. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకునేలా టెక్ కంపెనీలు సరికొత్త ఛార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటిలో వైర్ లెస్ ఛార్జర్లు, మాగ్నెటిక్ పవర్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంతకీ మాగ్నెటిక్ పవర్ బ్యాంకులు ఎలా పని చేస్తాయి? అనే విషయాన్ని తెలుసుకుందాం..
మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ లు సాధారణం MagSafe టెక్నాలజీ ద్వారా పని చేస్తాయి. డివైస్‌లను మాగ్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేస్తుంటాయి. ఈ పవర్ బ్యాంకులు ఫోన్ కు అటాచ్ అయి ఉంటుంది. మీ ఫోన్ ను స్టెబుల్ గా ఉంచి ఛార్జ్ చేస్తాయి.
మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు
మాగ్ సేఫ్ అనుకూలత: ఆపిల్ iPhone 12, ఆ తర్వాతి మోడల్స్ లో మాత్రమే పని చేస్తాయి.
డివైజ్ బయట ఉండే బ్యాటరీ: ఈ పవర్ బ్యాంక్ ను ఫోన్ వెనుక వైపు అటాచ్ చేయగానే డివైస్ కు ఆప్షనల్ పవర్ సప్లై ఇస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్: మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ లు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తాయి. వేగంగా ఫోన్ ను చార్జ్ చేసే అవకాశం ఉంటుంది.
ఈజీగా వాడే అవకాశం: ఇవి ప్రత్యేకమైన మాగ్నెటిక్ బ్యాంక్ ని అటాచ్ మెంట్ వ్యవస్థను ఉపయోగించి, సులభంగా ఫోన్‌తో కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అటాచ్ చేసిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
పాపులర్ మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ లు:
Apple MagSafe Battery Pack: ఆపిల్ బ్రాండు ప్రత్యేకంగా iPhone 12, ఆ తర్వాతి మోడల్స్ కోసం రూపొందించింది. ఇది iPhoneకి ఈజీగా అటాచ్ చేసే అవకాశం ఉంటుంది.
Anker 633 Magnetic Battery: అన్కర్ నుంచి మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ 5,000 mAh బ్యాటరీ కెపాసిటీతో మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
Spigen MagFit Magnetic Power Bank: Spigen కూడా మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కంపాక్ట్, శక్తివంతమైన ఛార్జింగ్‌ను అందిస్తుంది.
Mophie MagSafe Powerstation: Mophie బ్రాండ్ నుంచి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ కెపాసిటీతో కూడిన పవర్ బ్యాంక్ లలో ఇది ఒకటి.
మాగ్నెటిక్ పవర్ బ్యాంక్ లతో లాభాలు
స్టైలిష్ డిజైన్: ఫోన్, బ్యాంక్ మధ్య అటాచ్మెంట్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
ఫాస్ట్ ఛార్జింగ్: MagSafe టెక్నాలజీ రూపొందిన ఈ పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ చాలా వేగంగా ఎక్కుతుంది.
అటు పలు స్మార్ట్ ఫోన్లకు వైర్ లెస్ ఛార్జర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.వీటి ద్వారా ఛార్జింగ్ పాయింట్ పై ఫోన్ పెట్టడం చాలా సులభం. వైర్ లెస్ ఛార్జర్ కేబుల్ చిక్కుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Read Also: మీ జేబులో ఫోన్‌ను ఎంత సేపు పెట్టుకుంటున్నారు? సంతానంపై ఆశలు వదిలేసుకోండి!