యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ 16ఈ (iPhone 16E) ఇటీవల మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి వచ్చింది. 16 సిరీస్ మోడల్ కు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో 16ఈని రంగంలోకి దించారు. కానీ ఐఫోన్ 16e మోడల్లో ఆపిల్ మాగ్‌సేఫ్, డైనమిక్ ఐలాండ్, అల్ట్రా వైడ్‌బ్యాండ్ (UWB) వంటి పలు కీలక ఫీచర్లను తొలగించారు. దీంతో టెక్ నిపుణులతోపాటు వీటిని కొనుగోలు చేసిన అనేక మంది యూజర్లు ఆ ఫీచర్లను తొలగించారని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ సంస్థ వీటిపై స్పందించింది.
ఐఫోన్ 12 మోడల్ ద్వారా వచ్చిన MagSafe ఫీచర్ ప్రత్యేక సౌకర్యాలను అందిస్తుంది. ఇది వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతోపాటు ఇతర మాగ్నెటిక్ ఛార్జర్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
గతంలో ఈ ఫీచర్ పనితీరు నేపథ్యంలో అనేక మంది ఎక్కువగా వైర్డ్ ఛార్జింగ్‌ను ఇష్టపడుతున్నారని యాపిల్ తెలిపింది. అందుకే ఐఫోన్ 16eలో ఈ ఫీచర్ అవసరం లేదని భావించి తొలగించినట్లు చెప్పింది. దీనికి బదులుగా ఫోన్‌లో USB టైప్-సీ పోర్ట్ ఉందన్నారు. వైర్‌లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే iPhone 16e 7.5W Qi ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ ఇస్తుందన్నారు. ఇది iPhone 16, 16 Proలో 15W, 25W MagSafe ఛార్జింగ్ చాలా నెమ్మదిగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: Recharge Offer: ఈ రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. రూ. 126కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్
MagSafeతో పాటు iPhone 16eలో UWB కనెక్టివిటీ కూడా లేదు. ఇది చాలా కీలక లోపమని చెప్పవచ్చు. ఎందుకంటే AirTags వంటి పరికరాలతో ఖచ్చితమైన లొకేషన్ ట్రాకింగ్ కోసం ఉపయోగపడుతుంది. కానీ దీనిని కూడా యాపిల్ సమర్థించుకుంది. కొనుగోలుదారులు ఇలాంటి ఫీచర్ కోసం ఆసక్తి చూపించడం లేదని వెల్లడించింది. UWB తొలగింపు కూడా ఫోన్ ధర తగ్గుదలకు దోహదపడుతుందని చెప్పింది.
వినియోగదారులు ఎక్కువగా వైర్డు ఛార్జింగ్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారని ఆపిల్ చెబుతోంది. అందుకే MagSafeని తీసేసి ఖర్చులు తగ్గించామని అంటోంది. అయితే దీనిపై పలువురు యూజర్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. మాకు ధర ఎక్కువైనా పర్లేదు కానీ, ఆ ఫీచర్లు కూడా కావాలని అంటున్నారు. మరికొంత మంది మాత్రం అలాంటి ఎక్స్ ట్రా ఫీచర్లను తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక భారతదేశంలో ఐఫోన్ 16e మోడల్ ధర విషయానికి వస్తే కేవలం రూ. 59,900 నుంచి మొదలవుతుంది. కానీ యాపిల్ గత మోడల్స్ ఐఫోన్ 15 రేటు రూ. 69,900, ఐఫోన్ 16 ధర రూ. 79,900 ఉండటం విశేషం. అయితే పెరిగిన మొబైల్ మార్కెట్ నేపథ్యంలో యూజర్లకు సౌకర్యవంతమైన ఫీచర్లను అందుబాటులో ఉంచేందుకు ధరలను తగ్గించినట్లు యాపిల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో యాపిల్ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయి. ఈ మోడల్ విషయంలో పలు ఫీచర్లను తొలగించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.