BigTV English

Recharge Offer: ఈ రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. రూ. 126కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్

Recharge Offer: ఈ రీఛార్జ్ ప్లాన్ అదుర్స్.. రూ. 126కే డైలీ 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్

దేశంలో గత ఏడాది జూలైలో ప్రైవేటు టెలికాం కంపనీలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో అనేక మంది యూజర్లు ప్రభుత్వ నెట్ వర్క్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు మారిపోయారు. అయితే ఈ ప్రభుత్వ సంస్థ యూజర్లను ఆకట్టుకునే విధంగా తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. దీంతో అనేక మంది క్రమంగా బీఎస్ఎన్ఎల్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కంపెనీ మరో బడ్జెట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.


నెలకు జస్ట్ రూ. 126

ఈ ప్లాన్ ధర రూ. 1515 కాగా, 365 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. అంటే దీని నెలవారీ ఖర్చు ప్రకారం చూస్తే రూ. 126 మాత్రమే అవుతుందని చెప్పవచ్చు. దీనిలో వినియోగదారులు రోజుకు 2GB డేటాను పొందుతారు. అంటే మొత్తం 720GB డేటా మీకు లభిస్తుంది. దీంతోపాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్, OTT స్ట్రీమింగ్, వీడియో స్ట్రీమింగ్ సౌకర్యాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతోపాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. వినియోగదారులు రోజువారీ హై స్పీడ్ డేటా పరిమితిని మించిపోతే వారు ఎటువంటి కనెక్టివిటీ సమస్యలు లేకుండా 40Kbps వేగంతో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

Read Also: Bank Holidays: 14 రోజులు బ్యాంకులకు సెలవు.. పనిచేసేది సగం రోజులేనా..


డేటాతోపాటు…

ఈ ప్లాన్‌ ప్రధానంగా ప్రతి రోజు డేటాతోపాటు కాల్స్ మాట్లాడుకునే వారికి మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ కోసం ఒకేసారి 365 రోజుల రీఛార్జ్ చేసుకుంటే మీ నెలవారీ ఖర్చులను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇంత తక్కువ ధరల్లో ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి ప్రైవేటు సంస్థల్లో ఎలాంటి ప్లాన్స్ కూడా అందుబాటులో లేవు. ఈ ప్రభుత్వ సంస్థ తక్కువ ధర ప్లాన్స్ అందిస్తున్న నేపథ్యంలో గత కొన్ని నెలల్లోనే ఆయా కంపనీల నుంచి దాదాపు 40 లక్షల మంది టెలికాం యూజర్లు BSNLకు వచ్చేశారు.

17 ఏళ్ల తర్వాత

ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ సుమారు 17 ఏళ్ల తర్వాత మొదటిసారి లాభాల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14, 2025న BSNL Q3FY25కి రూ. 262 కోట్ల లాభం వచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సంస్థ ఆదాయం పరంగా చూస్తే మొత్తం రూ.14,197 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇది గత సంవత్సరం రూ.12,905 కోట్లుగా ఉంది, అంటే ఏడాదిలో దాదాపు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రైవేట్ సంస్థల భయాందోళన

ఆ క్రమంలో సంస్థ మూడో త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 1466 కోట్లు పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 316 కోట్లుగా ఉంది. లాభాల ప్రకటన నేపథ్యంలో సంస్థ రూ. 1800 కోట్ల నష్టాలను భారీగా తగ్గించుకుందని చెప్పవచ్చు. ఈ సమయంలో సంస్థ ఖర్చులను మరింత తగ్గించుకుని కంపెనీ లాభాల్లోకి వచ్చేందుకు కృషి చేసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వ సంస్థ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు టెలికాం సంస్థలు మరింత భయాందోళన చెందుతున్నాయని చెప్పవచ్చు.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×