YSR Family Assets Dispute: వైఎస్ ఫ్యామిలీ ఆస్తి వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. నేరుగా షర్మిళ పేరెత్తి మరీ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఆ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఆరోపణలు చేసిన సతీష్ కుమార్ రెడ్డి, ఏకంగా షర్మిళ పేరెత్తి మరీ కామెంట్స్ చేశారు. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఓ 5 శాతం మందికి పథకాలు ఇచ్చి అమలు చేసేశాం అని చెప్పుకుంటున్నారన్నారు. తాను గొప్ప ఎకనామిస్ట్ అని సంపద సృష్టిస్తా అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఆ సృష్టించిన సంపద ఎక్కడుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు ఒక్కరూపాయి కూడా సంక్షేమ పథకాలు అందలేదు కానీ లక్ష కోట్లు పైనా అప్పు చేసిన ఘనత కూటమికి దక్కుతుందన్నారు. పెట్రోల్ పన్నులు అని ఆనాడు విమర్శించిన ఇప్పుడు పన్ను తగ్గించారా? ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నది కూటమి ప్రభుత్వమనంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. హామీలు ఇవ్వకపోతే కాలర్ పట్టుకోమన్న లోకేష్ ప్రజల్లోకి రావాలని, పోసాని మాటల మీద విమర్శలు చేస్తున్న వాళ్లు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాటలను మర్చిపోయారా? అదుపుతప్పి మీరు మాట్లాడితే ఎదుటివారూ అదుపుతప్పే మాట్లాడతారన్నారు.
నారా లోకేష్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెబుతారా అంటూ ప్రశ్నించారు. కూటమి నేతలు, ఎల్లో మీడియా ఎంత విషప్రచారం చేసినా జగన్ అడుగుపెట్టిన చోటల్లా ప్రజలు ప్రభంజనంలా వస్తున్నారని తెలిపారు. ఎన్ని అసత్యాలు ప్రచారం చేస్తే అంత గొప్పగా జగన్ మోహన్ రెడ్డి కీర్తి వ్యాపిస్తుందని, లోకేష్ పెద్ద కాలర్ల చొక్కా వేసుకుని రావాలని ఆయన కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల స్కానర్‌లో ఉన్నారన్నారు.
Also Read: CM Chandrababu: ఏపీకి అప్పులు ఇచ్చే దిక్కు లేదు.. సీఎం చంద్రబాబు
షర్మిళ బ్లాక్ మెయిల్ చేస్తోంది – సతీష్ రెడ్డి
వైఎస్ విజయమ్మకు జగన్, షర్మిళ ఇద్దరూ సమానమేనని సతీష్ రెడ్డి అన్నారు. కాకపోతే షర్మిళ, విజయమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. జగన్ ఎన్ని కష్టాలకైనా తట్టుకోగలడు కాబట్టే విజయమ్మ షర్మిళకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఒకవేళ జగన్ కు విజయమ్మ సపోర్ట్ చేస్తే షర్మిళ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అన్న భయం విజయమ్మలో ఉందన్నారు. ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నంత వరకు సరస్వతీ భూములను పంచుకోకూడదని జగన్, షర్మిళ మధ్య అగ్రిమెంట్ ఉందన్నారు. షర్మిళ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సతీష్ రెడ్డి ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తం మీద సతీష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై షర్మిళ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.